వీధికుక్కల సమస్యలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. వీధి కుక్కల తరలింపు ఆదేశాల ఉపసంహరణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలను తొలగించాలని గత నవంబర్‌లో ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తర్వును సవరించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆదేశాలు అమలుచేయకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని సుప్రీం కోర్టు హెచ్చరించింది.
సుమోటాగా స్వీకరించిన...వీధి కుక్కల సమస్యపై సుమోటోగా స్వీకరించిన కేసుపై ధర్మాసనం తీర్పు చెప్పింది. వీధికుక్కలను తొలగించాలని అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. బహిరంగ ప్రదేశాలు, క్రీడా సముదాయాల్లో కుక్కలు ఉండకూడదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీధికుక్కలను ఆశ్రయ కేంద్రాలకే తరలించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

