టీవీకే విజయ్‌కే తమిళనాడు సీఎం పీఠం దక్కనుంది. మ్యాజిక్ ఫిగర్‌కు టీవీకే చేరువలో ఉంది. విజయ్ పార్టీకి అధికారాన్ని చేపట్టడం కోసం కొన్ని సీట్లు అవసరమైతే బీజేపీతో విజయ్ పొత్తు పెట్టుకోరన్నది వాస్తవం.
టీవీకే విజయ్ కు కాంగ్రెస్, సీపీఐ, పీఎంకే మద్దతు కోరే అవకాశముందని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. పీఎంకే ఆరు, కాంగ్రెస్ ఐదు, సీపీఐ రెండు సీట్లలో లీడింగ్ లో ఉంది. సాయంత్రానికల్లా కొత్త ఈక్వేషన్లపై క్లారిటీ రానుంది.
రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు...
ఇప్పటికే తమిళవ్యాప్తంగా విజయ్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది. అన్నాడీఎంకేతో పవర్ షేరింగ్ విజయ్ విముఖత చూపడంతో ఇక కాంగ్రెస్ పట్ల మొగ్గు చూపే అవకాశాలున్నాయి. విజయ్ తొలి నుంచి బీజేపీకి దాని కూటమికి వ్యతిరేకంగానే ఉన్నారు. అయితే కొంత కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగానే ఉన్నట్లు తొలి నుంచి సంకేతాలు అందుతున్నాయి. చెన్నై సిటీలో తప్ప అన్నిచోట్లా టీవీకే ప్రభంజనం కొనసాగుతుంది. తమిళనాడులో టీవీకే సెంచరీ కొట్టింది. 100కుపైగా స్థానాల్లో విజయ్ పార్టీ ముందంజలో ఉంది. రెండో స్థానంలో ఏఐఏడీఎంకే ఉంది. డీఎంకే మూడో స్థానానికి పడిపోయింది.
కారణాలివే...
తమిళనాడులో విజయ్ ముందంజకు కారణాలున్నాయి. రాష్ట్రంలో ఉన్న కనిపించని భారీ శూన్యత, విజయ్ కు ఉన్న విపరీతమైన ఫాలోయింగ్, విజయ్ ను పదేపదే టార్గెట్ చేసి టార్చర్ చేయడం.. ఇది సానుభూతి పెంచిందని చెప్పాలి.పాలక డీఎండీకే వైఫల్యాలు.. అన్నాడీఎంకే అనాశక్తత కూడా విజయ్ వైపు ప్రజలు మొగ్గు చూపడానికి కారణాలని చెప్పాలి. విజయ్ లో ఎంజీఆర్ తో జయలలితను ప్రజలు చూసుకున్నారు. విజయ్‌కు యూత్, దళిత్ ఓటు బ్యాంకు..కలిసొచ్చిందనే చెప్పాలి. హిందూ వ్యతిరేక ముద్రతో డీఎంకే నష్టపోయింది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలున్నాయి. టీవీకే 111 సీట్లలో ఆధిక్యంలో ఉండటంతో ఇక అధికారానికి చేరువలో ఉన్నట్లే.

