Tamilnadu : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని తప్పు పట్టింది.
ప్రభుత్వ బస్సు ప్రమాదాల్లో చనిపోయిన వారికి కూడా ఇలాగే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారా? అని ప్రశ్నించింది.
అర్హత ఉన్న వారికే...అర్హత ఉన్న వారికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాలు ఉచితంగా పంచి పెట్టేది కాదని అభిప్రాయపడింది. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కొన్ని నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని, వాటి కోసం ఎంత మందో ఎదురు చూస్తుంటారని మద్రాస్ హైకోర్టు చెప్పింది. దీంతో టీవీకే సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.

