తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కుప్పకూలవచ్చంటూ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు పార్టీ కేడర్ సిద్ధంగా ఉండాలని స్టాలిన్ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఏ క్షణమైనా ప్రభుత్వం..గత ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమి తాత్కాలికమేనన్న మాజీ సీఎం స్టాలిన్, త్వరలోనే మళ్లీ ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పాయి. స్టాలిన్ వ్యాఖ్యలు తమిళనాట రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. విజయ్ ప్రభుత్వం ఏర్పాటయి పది రోజులు కూడా కాకముందే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది.

