Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Weather Report : వానల్లేవ్.. చలి తీవ్రత పెరుగుతుందా? లేదా?

Weather Report : వానల్లేవ్.. చలి తీవ్రత పెరుగుతుందా? లేదా?

TeluguPost.com 10 hrs ago

Telangana : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ప్రాంతాన్ని బట్టి భిన్నంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల వానలు పడతాయని, మరికొన్ని చోట్ల పొడి వాతావరణం నెలకొని ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

అక్వాన్ తుపాను ప్రభావం పూర్తిగా తొలిగిపోయిందని, అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన నివేదికలు సూచిస్తున్నాయి. మరొకవైపు రెండు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుందని కూడా చెప్పింది. ఇప్పటికే కొంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న కాలంలో మరింతగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు, చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, దూర ప్రాంతం, ఘాట్ రోడ్డులలో ప్రయాణం చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఏపీలో నేడు పొడి వాతావరణం...ఆంధ్రప్రదేశ్ లో నేడు పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడితే పడవచ్చని పేర్కొంది. నేడు ఆంధ్రప్రదేశ్ లో పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు నమోదవుతుందని, అదే సమయంలో కనిష్ట ఉష్ణోగ్రత సుమారు 22 డిగ్రీలు నమోదు కాచ్చు. ఉదయం పూట పొగమంచు దట్టంగా అలుముకుంటుంది. జాతీయ రహదారిపై ప్రయాణం చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పొగమంచులో ప్రయాణాన్ని అవసరమైతే తప్ప చేయవద్దని కూడా సూచిస్తున్నారు. మరొకవైపు మత్స్యకారులకు ఎలాంటి నిషేధాజ్ఞలను వాతావరణ శాఖ ప్రకటించలేదు. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవచ్చు. అక్వాన్ తుపాను ఒడిశా వైపు తరలి వెళ్లడంతో వానలు కూడా మందగించాయని, ఇక క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలో భిన్న మైన వాతావరణం...తెలంగాణలోనూ నేడు భిన్నమైన వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల చలిగాలుల తీవ్రత పెరుగుతుందని, కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. అక్వాన్ తుపాను ప్రభావంతో నిన్నటి వరకూ ఉన్న చలి తీవ్రత కొంత మేరకు తగ్గినా ఇంకా చలిగాలుల తీవ్రత కొనసాగుతుందని, ఉదయం, రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో నేడు గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 32 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత సుమారు18 డిగ్రీల వద్ద ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతుంది. ఈ సీజన్‌లో తొలిసారిగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రతలు నమోదయినట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోహీర్‌లో 9.7, న్యాల్‌కల్‌, ఝరాసంగంలో 10 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 10.5 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా బషీరాబాద్, ధారూర్‌లో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావారణ శాఖ ప్రకటించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu