Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Weather Update: విస్తారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు

Weather Update: విస్తారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు

TeluguPost.com 4 months ago

Hyderabad : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో వానలు పడతాయని చెప్పింది.

మరో వారం రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించి పక్షం రోజులు దాటుతున్న ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో సరైన వానలు పడటం లేదు. అయితే అల్పపీడనం ప్రభావంతో వానలు భారీగానే పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ప్రధానంగా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంటకు అనువైన వానలు కురిస్తే తమకు ప్రయోజనం అని చెబుతున్నారు.

అల్పపీడనం ప్రభావంతో...

ఆంధ్రప్రదేశ్ లో వానలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 8వ తేదీ వరకూ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని చెప్పింది. ముఖ్యంగా కోస్తాంధ్ర తో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోనూ వానలు పడతాయని వాతవరణ శాఖ అంచనాలు వేస్తుంది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విద్యుత్తు స్థంభాలు, చెట్ల కింద ఉండ వద్దని హెచ్చరించింది.

తెలంగాణలోనూ వానలు...

తెలంగాణలోనూ వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తుండటంతో వానలు పడే అవకాశముందని చెప్పింది. అలాగే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. తూర్పు, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లోనూ వానలు పడతాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లోనూ భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్తు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu