తెలంగాణ: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం కలకలం రేపింది. ప్లాంట్‌లోని యూనిట్-3 పరిధిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పంప్ వద్ద ఆయిల్ లీకేజీ కావడం వల్లే మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదంతో ప్లాంట్ ఆవరణ మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుంది.
అగ్నిప్రమాదంలో కంట్రోల్ కేబుల్స్, వాల్వ్‌లు దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే ప్రధాన యంత్రాలకు ముప్పు తప్పినట్లు తెలుస్తోంది. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

