Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ys Jagan :ఆడకుండానే టీచర్ ఉద్యోగాలు.. ఆహా ఏం పాలన?

Ys Jagan :ఆడకుండానే టీచర్ ఉద్యోగాలు.. ఆహా ఏం పాలన?

TeluguPost.com 11 hrs ago

Andhra Pradesh : మరోసారి మెగా డీఎస్సీ నిర్వహణలో జరిగిన లోపాలను వైఎస్ జగన్ ప్రశ్నించారు. మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ జీవోలు ఇచ్చేది వారే, మళ్లీ మెగా డీఎస్సీ పూర్తయిన వెంటనే వాటిని తొలగించడం ఎందుకని నిలదీశారు.

మెగా డీఎస్సీపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో వేధిస్తున్నారని అన్నారు. తాను గతంలో వేసిన ప్రశ్నలకు చంద్రబాబు, లోకేశ్ లు సమాధానం ఇవ్వలేదని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు లేకుండానే ఉద్యోగాలు ఎలా ఇచ్చారని జగన్ ప్రశ్నించారు. ఫస్ట్ ర్యాంక్ కు వచ్చిన నవీన్ కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేని, నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడని జగన్ నిలదీశారు. అసెంబ్లీలో పట్టపగలు అబద్ధాలు ఆడేందుకు చంద్రబాబు, ఆయన కొడుకు ఆడారని ఆరోపించారు. మెగా డీఎస్సీలో జరిగిన బేరసారాల ఆడియోను జగన్ మీడియా సమావేశంలో ప్రదర్శించారు.

లక్షల మంది చెలగాటమాడుతూ...లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడే ఈ తండ్రీకొడుకులు బరితెగించారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. తవ్వే కొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయని అన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు. స్కామ్ ను దాచి పెట్టేందుకు ప్రయత్నించడం నిజం కాదా? అని జగన్ ప్రశ్నించారు.డబ్బులు తీసుకుని మరీ ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. ఏ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చేశారని జగన్ దుయ్యబట్టారు. జరగని ఆటలు, పోటీలు జరిగినట్లుగా చూపారన్నారు. తప్పుడు సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇచ్చేశారని తెలిపారు. బాబు స్కామ్ ల హిస్టరీలో డీఎస్సీ ఒకటి అని జగన్ అన్నారు. 372 స్పోర్ట్స్ కోటలో ఉద్యోగాలు ఇచ్చారని, అందులో జూడో ఆటతో 39 మందికి పరీక్షే లేకుండా ఉద్యోగం ఇచ్చారని జగన్ అన్నారు. సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్ షిప్ 2013లో ఖమ్మం లో జరిగినట్లు, అందులో గెలిచినట్లు చూపారన్నారు. ఆ పోటీలు ఖమ్మంలో జరగలేదని ఖమ్మం డిస్ట్రిక్ట్ జూడో అసోసియేష్ తెలిపిందని జగన్ అన్నారు.కాక్రోచ్ లు అందుకే బయటకు ...ఇలాంటి స్కామ్ ల వల్లనే కాక్రోచ్ లు బయటకు వస్తున్నాయని జగన్ అన్నారు. ఏపీ జూడో అసోసియేషన్ కార్యదర్శి లోకేశ్ తోడల్లుడు విశాఖ ఎంపీ భరత్ అని జగన్ అన్నారు. సాఫ్ట్ బాల్ కోటా కింద 39 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. కుటుంబం మొత్తం ప్యాకేజీ మాట్లాడుకున్నా రని జగన్ అన్నారు. విశాఖకు చెందిన యోగేశ్వరరావు, అతని సోదరికి కూడా ఉద్యోగం వచ్చిందని జగన్ అన్నారు. యోగేశ్వరరావు ఏ పరీక్ష రాయలేదని జగన్ చెప్పుకొచ్చారు. నల్లగొండలో జరిగిన కోకో ఛాంపియన్ షిప్ లో యోగేశ్వరరావు ఫస్ట్ ప్లేస్ గా చూపారన్నారు. యోగేశ్వరరావు చెల్లికి సెకండ్ ప్లేస్ అన్నారు. కానీ తీరా చూస్తే విజేతల జాబితాలో లేరని తెలంగాణ కోకో అసోసియేషన్ చాలా స్పష్టంగా చెప్పిందని, ఆ రోజు పోటీలో పాల్గొన్న వారి వివరాలను కూడా విడుదల చేసిందని జగన్ అన్నారు. డీఎస్సీ స్కామ్ ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారని జగన్ అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu