Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ys Sharmila : బెంగళూరు ఎయిర్ పోర్టులోనే షర్మిలను అడ్డుకున్నపోలీసులు

Ys Sharmila : బెంగళూరు ఎయిర్ పోర్టులోనే షర్మిలను అడ్డుకున్నపోలీసులు

TeluguPost.com 38 mins ago

Bengaluru : బెంగళూరు ఎయిర్‌పోర్ట్ లో వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వులు ఉండటంతో పోలీసులు బెంగళూరు ఎయిర్ పోర్టులోనే వైఎస్ షర్మిల, విజయమ్మలను అడ్డుకున్నారు.

యలహంక ప్యాలెస్‌లోకి వెళ్లకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, బెంగళూరు విమానాశ్రయం వద్ద వైఎస్ షర్మిల, విజయమ్మలను పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఎవరినీ అనుమతించబోమని పోలీసులు తేల్చిచెప్పారు.

తన తల్లి, కుమార్తెతో కలసి...

షర్మిల తన తల్లి, కుమార్తెతో కలిసి విమానంలో బెంగళూరు చేరుకున్నారు.యలహంక ప్యాలెస్‌లోకి షర్మిల ప్రవేశించకుండా కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. సిలికాన్ బిల్డర్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ వివాదంపై తదుపరి విచారణ డిసెంబర్ 19కి వాయిదా పడింది. తన ఇంటికి తాను వెళ్తే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. అయితే పోలీసులు అంగీకరించకపోవడంతో బెంగళూరులోని ఒక హోటల్ కు చేరుకున్నారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu