Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
YSRCP : జగన్ కు రాజకీయంగా ఆ నిర్ణయం ఇబ్బంది తెచ్చిపెడుతుందా?

YSRCP : జగన్ కు రాజకీయంగా ఆ నిర్ణయం ఇబ్బంది తెచ్చిపెడుతుందా?

TeluguPost.com 1 week ago

ఆంధ్రప్రదేశ్ లో నియోజకవర్గాల సంఖ్య పెరిగితే వైసీపీకి రాజకీయంగా నష్టం జరిగే అవకాశాలున్నాయని ఆ పార్టీ భావిస్తుంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతమున్న 175 శాసనసభ నియోజకవర్గాలను 225 నియోజకవర్గాలకు పెంచాల్సి ఉంది.

నియోజకవర్గాల సంఖ్య పెరిగితే వైసీపీకి మేలు జరగదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేస్తే కూటమి లబ్ది పొందుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. వైసీపీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండటంతో నియోజకవర్గాల సంఖ్య పెంపుదల కలసి రాదని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయట.

ఇటీవల ఢిల్లీ పర్యటనలో...అందుకే నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని ఇటీవల ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి వినతి పత్రాన్ని సమర్పించినట్లు తెలిసింది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే కూటమి పార్టీల మధ్య విభేదాలు పెద్దగా ఉండవు. ఆశావహులందరికీ టిక్కెట్లు లభిస్తాయి. అదే నియోజకవర్గాల సంఖ్య పెరగకపోతే టిక్కెట్ల కోసం కూటమి పార్టీల మధ్య, నేతల మధ్య పోటీ పెరిగి అది తమకు లాభిస్తుందని వైసీపీ అంచనా వేస్తుంది. వాస్తవానికి ఎప్పుడో నియోజకవర్గాల పెంపు జరగాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ జరగలేదు. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ మాత్రం...వైసీపీ నియోజకవర్గాల సంఖ్య పెరగకుండా ఉంటే చాలునని భావిస్తుంది. అయితే కూటమిలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. 2019లోనే నియోజకవర్గాల పెంపు జరగాల్సి ఉన్నా జరగకపోవడం, 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కూడా నియోజకవర్గాల పెంపుపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంతో వైసీపీకి సంఖ్య పెంపు ఇష్టం లేదని అర్థమవుతుంది. టీడీపీ కేంద్రంలో కీలకంగా ఉండటంతో చంద్రబాబు ఆలోచనలే అమలయ్యే అవకాశాలున్నాయి. అయితే నియోజకవర్గాల పునర్విభజన 2026 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను పెంచాల్సి ఉంది. కానీ 2028 నాటికి గాని జనాభా లెక్కలు పూర్తయితే 2029 ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలతో ఎన్నికలకు వెళ్లవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. మరి జగన్ మాత్రం ఇందుకు అనాసక్తి చూపుతున్నారని తెలిసింది. మరి నియోజకవర్గాలు పెరిగితే జగన్ కు రాజకీయంగా మరోసారి ఇబ్బందులు తప్పవని, ఆ వ్యూహాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu