Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
YSRCP : రాచమల్లు అంతగా రియాక్ట్ అవుతుండటానికి కారణాలివేనా?

YSRCP : రాచమల్లు అంతగా రియాక్ట్ అవుతుండటానికి కారణాలివేనా?

TeluguPost.com 3 months ago

Andhra Pradesh : వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పార్టీకి అధికార ప్రతినిధిగా మారారు. ఏ విషయంలోనైనా ముందుగా స్పందిస్తుంది ఆయనే. అంశంతో సంబంధం లేదు.

జగన్ కుటుంబ వ్యవహారాలైనా ఆయనే వివరణ ఇస్తున్నారు. షర్మిల చేసే కామెంట్లకు కూడా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమాధానమిస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వం పనితీరుపైన కూడా నిరంతరం విమర్శలు చేస్తూ పార్టీలో హైలెట్ అవుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే వైసీపీ అధికార ప్రతినిధులకంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నారని వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఆయన వెంటనే స్పందించినట్లుగా మరే నేత స్పందించడం లేదని కార్యకర్తలే అంటున్నారు.

వరసగా రెండు సార్లు గెలిచి...

ప్రొద్దుటూరు నుంచి వరగా గెలిచిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వరదరాజులు రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి విజయం సాధించారు. ఓటమి పాలయినా ఆయన కేవలం ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని టీడీపీ నేతలపై విమర్శల కన్నా రాష్ట్ర స్థాయి అంశాలపై ఎక్కువగా స్పందిస్తున్నారు. కొంత కాలం క్రితం వైఎస్ షర్మిల ఆస్తుల విషయంలో చేసిన ఆరోపణలపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వివరంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి షర్మిలకు కౌంటర్ ఇచ్చారు. సహజంగా జగన్ కుటుంబ వ్యవహారమని చాలా మంది నేతలు దూరంగా ఉన్నా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాత్రం తాను తగ్గేదేలేదంటూ జగన్ పక్షాన మాట్లాడుతున్నారు.

ఇంతలా యాక్టివ్ కావడానికి...

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంతలా యాక్టివ్ కావడానికి కారణమేంటన్న దానిపై వైసీపీలోనే పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. రాయలసీమలోనే కాదు.. పేర్ని నాని, అంబటి రాంబాబు తర్వాత ఆ రేంజ్ లో రియాక్ట్ అవుతుంది కేవలం రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాత్రమేనని, కానీ సొంత నియోజకవర్గం టీడీపీ నేతల నుంచి కూడా ఆయనకు కౌంటర్ లు రాకపోవడంతో ఆయన అలా మాట్లాడేస్తుంటారని కూటమి నేతలు సరిపెట్టుకుంటున్నారు. రాయలసీమలో ఇప్పుడు ఫైరున్న లీడర్ ఎవరయ్యా అంటే వైసీపీలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైపు అన్ని వేళ్లు చూపుతున్నాయంటే.. ఆయన జగన్ దృష్టిలో ఇప్పటికే పడ్డారని, రాచమల్లుకు భవిష్యత్ ఉందని ఆయన అనుచరులు పెద్దయెత్తున ప్రచారం చేసుకుంటున్నారు .



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu