Dailyhunt
YSRCP : వెల్లంపల్లి డిసైడ్ అయ్యారా? జగన్ ను ఒప్పించారా?

YSRCP : వెల్లంపల్లి డిసైడ్ అయ్యారా? జగన్ ను ఒప్పించారా?

TeluguPost.com 3 weeks ago

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తిరిగి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన తరచూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించడమే కాకుండా అక్కడ సమస్యలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.

వెల్లంపల్లి శ్రీనివాస్ తనకు అచ్చొచ్చిన పశ్చిమ నియోజకవర్గానికే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో నియోజకవర్గాన్ని మార్చి తనకు అన్యాయం జరిగిందని భావిస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఈసారి ఎలాగైనా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు ఆయన కదలికలను బట్టి తెలుస్తోంది.

రెండు సార్లు గెలిచి...వెల్లంపల్లి శ్రీనివాస్ రెండు సార్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఒక సారి ప్రజారాజ్యం నుంచి ఎన్నికయ్యారు. మరొకసారి వైసీపీ నుంచి గెలిచారు. 2009లో ప్రజారాజ్యం నుంచి, 2019లో వైసీపీ నుంచి గెలిచారు. ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ కు అదే కోటాలో జగన్ మంత్రివర్గంలో చోటు కూడా దక్కింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే తనకు పట్టుందని చెబుతున్నారు.అక్కడ తనకంటూ ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉందని చెప్పకనే పార్టీ నాయకత్వానికి తెలియజేస్తున్నారు. విజయవాడ లో తనకంటూ ఒక గుర్తింపు ఇచ్చిన నియోజకవర్గం పశ్బిమ మాత్రమేనని, ఈసారి అక్కడి నుంచే పోటీ చేస్తానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి...వెల్లంపల్లి శ్రీనివాస్ కు గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ ఇవ్వలేదు. ఆయనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. దీంతో ఆయన అక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ ఈసారి తాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని చెబుతుండటంతో పాటు అక్కడ పార్టీ కార్యక్రమాలకు కూడా తానే నాయకత్వం వహిస్తుండటంతో జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఏమైనా వచ్చిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మొత్తం మీద వెల్లంపల్లి శ్రీనివాస్ మనసంతా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంపైనే ఉంది. మరి జగన్ చివరకు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu