Dailyhunt
Aasmaan Movie: మేఘాంశ్ శ్రీహరి హీరోగా 'ఆస్మాన్' చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

Aasmaan Movie: మేఘాంశ్ శ్రీహరి హీరోగా 'ఆస్మాన్' చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

Telugu Rajyam 1 week ago

Aasmaan Movie: శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా 'ఆస్మాన్' మూవీని కొండారు వెంకటేష్, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు.

మేఘాంశ్ శ్రీహరి హీరోగా రానున్న ఈ చిత్రానికి రామ్ నందన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవాన్ని శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి సాయి దుర్గ తేజ్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, నిహారిక కొణిదెల, రోషన్ కనకాల, తిరువీర్, నార్నే నితిన్, రామ్ తాళ్లూరి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గ తేజ్ క్లాప్ కొట్టగా, సందీప్ కిషన్ స్విచ్ ఆన్ చేశారు. నిహారిక కొణిదెల స్క్రిప్ట్‌ని అందించగా.. తొలి సన్నివేశానికి రామ్ నందన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్ర ప్రారంభోత్సవంలో..

*మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ..* 'నా 'ఆస్మాన్' సినిమా ప్రారంభోత్సవంకి వచ్చిన సాయి అన్నకి, నిహారిక అక్కకి, సందీప్ అన్నకి అందరికీ థాంక్స్. నిర్మాతలు వెంకటేష్, శ్రీకాంత్ గార్లతో పని చేయడం ఆనందంగా ఉంది. రామ్ నందన్ ఓ అద్భుతమైన కథను చెప్పారు. మేం బ్లాక్ బస్టర్ కొట్టబోతోన్నాం. మిగిలిన వివరాలు మున్ముందు ప్రకటిస్తామ'ని అన్నారు.

*డైరెక్టర్ రామ్ నందన్ మాట్లాడుతూ..* 'తెలుగులో నాకు 'ఆస్మాన్' తొలి అవకాశం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకటేష్ గారు, శ్రీకాంత్ గార్లకు థాంక్స్. మేఘాంశ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. మూడు షెడ్యూల్స్‌లో సినిమాని పూర్తి చేస్తాం. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌తో రాబోతోన్నాం. ఇది చాలా కొత్తగా ఉంటుంది' అని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Rajyam