Anakapalli Movie: డిఫరెంట్ కంటెంట్‌తో, రా అండ్ రస్టిక్‌గా భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం 'అనకాపల్లి'.
ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన కూడా ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఈ మూవీని జూన్ 5న విడుదల చేయనున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా అది అందరిలోనూ బజ్‌ను క్రియేట్ చేసింది.
ఇక తాజాగా 'అనకాపల్లి' నుంచి జాతర సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో సంగీత స్టెప్పులు, గ్రాండియర్‌గా పాటను తెరకెక్కించిన తీరు, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, మంగ్లీ గాత్రం ఇలా అన్నీ హైలెట్‌గా నిలుస్తున్నాయి. నిజంగానే ఓ జాతర చూస్తున్నామా? అన్న రేంజ్‌లో విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇక ఈ పాటకు గణేష్ సలాది లిరిక్స్, దేవజండ్ బాణీ మరింత స్పెషల్ అట్రాక్షన్‌తా నిలిచాయి.

