Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gaayapadda Simham Movie: దుల్కర్ సల్మాన్ లాంచ్ చేసిన 'గాయపడ్డ సింహం' అన్‌లిమిటెడ్ ఫన్, మ్యాడ్‌నెస్, సర్ప్రైజ్‌ థియేట్రికల్ ట్రైలర్‌

Gaayapadda Simham Movie: దుల్కర్ సల్మాన్ లాంచ్ చేసిన 'గాయపడ్డ సింహం' అన్‌లిమిటెడ్ ఫన్, మ్యాడ్‌నెస్, సర్ప్రైజ్‌ థియేట్రికల్ ట్రైలర్‌

Telugu Rajyam 3 weeks ago

Gaayapadda Simham Movie: తరుణ్ భాస్కర్ న్యూ-ఏజ్ ఎంటర్‌టైనర్ 'గాయపడ సింహం'తో అలరించబోతున్నారు. ఈ చిత్రం కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో మే 1న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

పవన్ సాదినేని సమర్పణలో ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ట్రైజర్, ఉర్రూతలూగించే పాటలతో మంచి బజ్‌ను సృష్టించింది, తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఉత్సాహాన్ని మరింత పెంచింది. వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ఈ కథ ఒక యువకుడి జీవితంలో జరిగే అనుకోని మలుపు చుట్టూ తిరుగుతుంది. అమెరికాలో సెటిల్ అవ్వాలని కలలుకనే తను, డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీల కారణంగా డిపోర్ట్ అవుతాడు. అతని కలలు ఒక్కసారిగా ఛిన్నాభిన్నమవుతాయి. ప్రేమ, భవిష్యత్తు.. ఒక్కసారిగా దెబ్బతినడంతో, తనలో పెరిగే నిరాశ, కోపం అతడిని ఒక విచిత్రమైన రివెంజ్ వైపు నడిపిస్తుంది. ఈ భావోద్వేగ ప్రయాణాన్ని దర్శకుడు సెటైర్, డార్క్ హ్యూమర్‌తో మేళవించి ఆసక్తికరంగా తెరకెక్కించారు.

దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ గ్లోబల్‌ సమస్యను యువతకు కనెక్ట్ అయ్యేలా కథగా మలిచారు. సూర్య ప్రకాశ్ జ్యోసుల అందించిన కథలో భావోద్వేగం, వ్యంగ్యం, హాస్యం అన్నీ సమతుల్యంగా కనిపిస్తున్నాయి. వినోదంతో పాటు ఆలోచింపజేసే అంశాలు కూడా ఇందులో ఉన్నట్లు ట్రైలర్ సూచిస్తోంది.

తరుణ్ భాస్కర్ ఒక సాధారణ యువకుడిగా, ఆశలు-నిజాల మధ్య ఇరుక్కుపోయిన పాత్రను సహజంగా పోషించారు. ఆయన నటనలో భావోద్వేగం, నిరాశ, సరదా.. అన్నీ నేచురల్ గా కనిపిస్తున్నాయి. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటిస్తూ కథకు మరింత అందాన్ని జోడించారు. విష్ణు ఓయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ వంటి సహాయ నటులు తమ పాత్రలతో సినిమాకు బలం చేకూర్చారు. జేడీ చక్రవర్తి నెగటివ్ షేడ్‌లో కనిపిస్తూ ఇంటెన్స్ ను పెంచగా, శ్రీ విష్ణు ప్రత్యేక పాత్రలో కనిపించడం సినిమాకు సర్ప్రైజ్ ఎలిమెంట్‌గా నిలుస్తుంది.

టెక్నికల్‌గా కూడా సినిమా బలంగా ఉంది. విద్యా సాగర్ చింత సినిమాటోగ్రఫీకి మోడరన్, కలర్‌ఫుల్ టచ్ ఇవ్వగా, స్వీకర్ అగస్తి సంగీతం కథకు ఎనర్జీని జోడించింది. విప్లవ్ ఎడిటింగ్ సినిమా పేస్ ను కట్టుదిట్టంగా ఉంచగా, చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైన్ విజువల్ రిచ్‌నెస్‌ను పెంచింది.

మొత్తానికి, ఇప్పటికే మంచి బజ్ ఉన్న ఈ చిత్రానికి ట్రైలర్ మరింత హైప్ తీసుకొచ్చింది. ఈ సమ్మర్‌లో న్యూ-ఏజ్ ఎంటర్‌టైనర్ గా 'గాయపడ్డ సింహం' ప్రేక్షకులని అలరించబోతుంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. 'గాయపడ్డ సింహం' టైటిల్ విన్నప్పటి నుంచే నాకు చాలా క్యూరియాసిటీ కలిగింది. 'ఆకాశంలో ఒక తార' సినిమా చేస్తున్నప్పుడు పవన్ ఈ సినిమా గురించి ప్రతిదీ చెప్తుండేవారు. ఇందులో నటిస్తున్న అందరూ నా మంచి ఫ్రెండ్స్. ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా వుంది. ప్రతి విజువల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇది తప్పకుండా బిగ్ సమ్మర్ బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్మకం ఉంది. ఈ సబ్జెక్ట్ అందరికీ రిలేటబుల్‌గా ఉంటుంది. మనలో చాలామంది ఎప్పుడో ఒకసారి అమెరికా వెళ్లాలని కల కంటారు. కాబట్టి ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. కశ్యప్ గారు చక్కగా డైరెక్ట్ చేయడంతో పాటు మంచి క్యారెక్టర్ చేశారు. జెడి గారి సినిమాలు చిన్నప్పటి నుంచి చుస్తున్నాను. ఆయన వర్క్ అంటే నాకు ఇష్టం. పవన్‌తో చేస్తున్న 'ఆకాశంలో ఒక తార' నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. పవన్ కూడా మల్టీ టాస్కర్. ఈ సినిమాను ఆయన ప్రజెంట్ చేస్తున్నారు. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. 'గాయపడ్డ సింహం' గ్రేట్ కంటెంట్‌తో వస్తోంది. తప్పకుండా అందరూ థియేటర్‌లో ఎంజాయ్ చేసేలా ఉంటుంది.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ: ఈ సినిమా ఐడియా చెప్పినప్పుడు చాలా నచ్చింది. కాన్సెప్ట్ బాగా అనిపించి వెంటనే కొనేశాం. నాలుగు రోజుల క్రితం సినిమా చూశాను. ఇందులో ఇద్దరు హీరోలు ఉన్నారు.. ట్రంప్ కూడా హీరోనే (నవ్వుతూ). చాలా మంచి కాన్సెప్ట్. 35 ఏళ్ల క్రితం జేడీ చక్రవర్తి చేసిన మనీ సినిమాల్లా ఇది కూడా కాన్సెప్ట్ బేస్డ్ సినిమా. కశ్యప్ చాలా డీసెంట్‌గా స్క్రిప్ట్ డిజైన్ చేశాడు. నేను సినిమా చూస్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. ఇందులో ఈ ఇద్దరు హీరోలతో పాటు ప్రభాస్, మహేష్ బాబు, సిద్ధార్థ, యష్, అర్జున్ రెడ్డిని కూడా వున్నారు(నవ్వుతూ). సెకండ్ హాఫ్‌లో ఐదు ఎపిసోడ్స్ థియేటర్‌లో బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అవి వర్క్ ఐతే ఇది మరో జాతిరత్నాలు అవుతుంది. శ్రీ విష్ణు క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్‌లో జేడీ సీరియస్‌గా ఉంటే, సెకండ్ హాఫ్‌లో నవ్విస్తాడు. చాలా ప్లాన్‌తో తెరకెక్కించారు. మే 1 కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఆడియన్స్‌తో కలిసి సినిమా చూస్తాను.

జేడీ చక్రవర్తి మాట్లాడుతూ: అందరికీ హాయ్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో నేను ఎక్కువగా దుల్కర్ గురించి మాట్లాడాను. ఆయన పవన్‌తో చేస్తున్న సినిమా మామూలుగా ఉండదు. 'గాయపడ్డ సింహం' కోసం దిల్ రాజు గారు, జీ స్టూడియోస్ కలిసి రావడం అంటే ఈ సినిమాపై ఉన్న నమ్మకం మరింత పెరిగింది. దిల్ రాజు గారి జడ్జ్‌మెంట్ చాలా స్ట్రాంగ్. ఆయన ఈ సినిమాతో కలిసి రావడంతో మాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Rajyam