Godari Gattupaina: యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది.
నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ అద్భుతమైన స్పందన వచ్చింది.
ఈ రోజు మేకర్స్ 'గోదారి గట్టుపైన’ నుంచి ‘నేను నా పల్లెటూరు' పాటను విడుదల చేశారు. పాట వినగానే అందమైన పల్లె జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. నాగ వంశీ కృష్ణ స్వరపరిచిన ఈ మెలోడీ పల్లెటూరి మట్టి వాసన, గోదావరి తీరాల అందంని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.
రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు పల్లెటూరి ఆత్మని హత్తుకునేలా చూపిస్తున్నాయి. ఎంఎల్‌ఆర్ కార్తికేయ వోకల్స్ ఈ పాటకు మరింత ప్రాణం పోసింది.
ఈ సాంగ్‌లో సుమంత్ ప్రభాస్ తన ఫ్రెండ్స్‌తో గడిపే సరదా క్షణాలని, పల్లెటూరి సింపుల్ లైఫ్‌ను ఎంతో సహజంగా చూపించారు. ఆ సన్నివేశాలు అందరికీ కనెక్ట్ అవుతున్నాయి. ఈ పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ఇన్‌స్టంట్ హిట్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రాని సినిమాటోగ్రఫీని సాయి సంతోష్, ప్రొడక్షన్ డిజైన్‌ను ప్రవాల్య, ఎడిటింగ్‌ను అనిల్ కుమార్ పి, సౌండ్ డిజైన్‌ను నాగార్జున తల్లపల్లి నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రం మే 8న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

