Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jetlee Movie: సత్య, రితేష్ రానా 'జెట్లీ' రిలీజ్ ట్రైలర్ విడుదల

Jetlee Movie: సత్య, రితేష్ రానా 'జెట్లీ' రిలీజ్ ట్రైలర్ విడుదల

Telugu Rajyam 3 weeks ago

Jetlee Movie: టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యూనిక్ కథలతో, అన్‌ప్రెడిక్టబుల్ హ్యూమర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ద్వయం, ఈసారి మరింత పెద్ద స్థాయిలో, మరింత వినోదంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైయ్యారు.

క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో మంచి బజ్ సృష్టించిన ఈ చిత్రం, తాజాగా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఇప్పటి వరకు కథను మిస్టరీగా ఉంచిన ప్రమోలకు భిన్నంగా, ఈ రిలీజ్ ట్రైలర్‌లో కథ కోర్ కాన్ఫ్లిక్ట్ ని చూపించారు. కథ ప్రజాపతి అనే కాన్‌మ్యాన్ చుట్టూ తిరుగుతుంది. మధ్యతరగతి కుటుంబాలని మోసం చేసి వారి డబ్బుని దోచుకుని దుబాయ్‌కు పారిపోయే అతడిని పట్టుకోవడానికి ప్రభుత్వం ఒక సీక్రెట్ ఏజెంట్‌ను పంపుతుంది. కానీ ఈ మిషన్ మధ్యలోనే ఫ్లైట్‌లో అనూహ్యమైన గందరగోళంగా మారుతుంది.

సత్య ఈ సినిమాలో సీరియస్‌నెస్, సిల్లీనెస్ మధ్య అద్భుతంగా బ్యాలెన్స్ చేసే పాత్రలో ఆకట్టుకున్నారు. టెన్షన్ ఉన్న సన్నివేశాల్లో కూడా తన టైమింగ్‌తో నవ్వులు పండిస్తూ, యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా వినోదాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని ఇమిటేట్ చేసే సీన్ థియేటర్లలో హైలైట్‌గా ఉండబోతోంది.

రియా సింఘా గ్లామర్‌కే పరిమితం కాకుండా కథలో కీలక పాత్రతో ఆకట్టుకుంటుంది. అజయ్ ప్రజాపతి పాత్రలో నెగటివ్ షేడ్స్‌తో కనిపిస్తుండగా, వెన్నెల కిషోర్, వైవా హర్ష తమ టైమింగ్‌తో నవ్వుల్ని రెట్టింపు చేశారు.

దర్శకుడు రితేష్ రాణా తన ప్రత్యేకమైన స్టైల్‌ను మరోసారి చూపించాడు. డార్క్ కామెడీ, ఓవర్ ది టాప్ సిచ్యుయేషన్స్, ఒకే ఫ్లైట్‌లో జరిగే కథతో ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తున్నాడు. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీకి స్టైలిష్ లుక్ ఇవ్వగా, కాల భైరవ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టెన్షన్‌తో పాటు ఫన్‌ను కూడా పెంచుతుంది. టెక్నికల్‌గా సినిమా స్టైలిష్‌గా, స్లీక్‌గా కనిపిస్తోంది.

మొత్తానికి రిలీజ్ ట్రైలర్ చూస్తే 'జెట్లీ' ఒక ఫన్, ఫాస్ట్-పేస్డ్ చేజ్ డ్రామాగా, వినోదంతో కూడిన రైడ్‌గా ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. రేపు విడుదల కానున్న ఈ సినిమాపై రిలీజ్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Rajyam