Dailyhunt
జూన్ 26న థియేటర్స్‌లో ప్రేక్షకులు సరికొత్త అఖిల్‌ను చూస్తారు.. 'లెనిన్‌'పై నమ్మకాన్ని వ్యక్తం చేసిన నాగార్జున

జూన్ 26న థియేటర్స్‌లో ప్రేక్షకులు సరికొత్త అఖిల్‌ను చూస్తారు.. 'లెనిన్‌'పై నమ్మకాన్ని వ్యక్తం చేసిన నాగార్జున

Telugu Rajyam 1 week ago

Lenin Movie: యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్‌ అఖిల్ అక్కినేని నెక్ట్స్ మూవీ 'లెనిన్‌' సినిమా నుంచి ఇప్పటి వరకు 'వారెవా వారెవా..' , 'ఎట్టా ఎట్టా..' అనే రెండు సాంగ్స్ విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ రెండు చార్ట్‌బస్టర్ సాంగ్స్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. మ్యూజికల్ సెన్సేషనల్ తమన్ సంగీత సారథ్యంలో విడుదలైన ఈ పాటలు అందరి దృష్టిని ఆకర్షించి సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.

ఇటీవల కింగ్ నాగార్జున.. లెనిన్ మూవీ ఫస్ట్ కాపీని చూసి సినిమా అవుట్‌పుట్‌తో పాటు టీమ్ పనితీరుపై చాలా ఇంప్రెస్ అయ్యారు. అంతే కాకుండా, నిన్న సినిమా చూశానని, ఎంతో నచ్చిందని బుధవారం రోజున తన ఎక్స్ అకౌంట్‌ (ట్విట్టర్)లో ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఈ సినిమాతో జూన్ 26న థియేటర్లలో ప్రేక్షకులు 'కొత్త అఖిల్'ను చూడబోతున్నారనే కూడా ఆయన హామీ ఇచ్చారు.

''నిన్న రాత్రి మా లెనిన్ సినిమా ఫస్ట్ కట్ చూసాను. నమ్మకంతో, గర్వంతో చెబుతున్నాను… జూన్ 26న మీరు ఒక కొత్త అఖిల్‌ను చూడబోతున్నారు. ఆ తేదీని గుర్తుంచుకోండి!!! థియేటర్లలో కలుద్దాం" అని నాగార్జున తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మెసేజ్ అక్కినేని ఫ్యాన్స్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. అఖిల్ పెర్ఫామెన్స్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూసి సెలబ్రేట్ చేయటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అఖిల్‌కు పెద్ద బ్రేక్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.

'లెనిన్' సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథతో పూర్తి ఎంటటైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో విడుదల కానుంది. ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నటీనటులు: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సె తదితరులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Rajyam