కరోనా మొదటి వేవ్ తరుణంలో కేరళ సర్కార్ కట్టు దిట్టమైన చర్యలతో మహమ్మారి విజృంభణను అడ్డుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా కేరళ ప్రభుత్వాన్ని ప్రసంశించింది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. మొదటి వేవ్ ని ధీటుగా ఎదుర్కొన్న కేరళ ప్రభుత్వం సెకండ్ వేవ్ ని కంట్రోల్ చేయలేకపోతుంది. దేశం అంతటా కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోతుంటే రాష్ట్రంలో రోజు రోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతుంది. రోజుకి 20 వేలకు పైచిలుకుగా కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేరళలో జులై 31, ఆగస్టు 1 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
గత కొన్ని రోజులుగా కేరళలో ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి.
అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

