Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేసీఆర్ సార్ ఫామ్‌హౌస్‌ల ఏం జేస్తున్నట్టు..?

కేసీఆర్ సార్ ఫామ్‌హౌస్‌ల ఏం జేస్తున్నట్టు..?

Telugu Rajyam 6 hrs ago

రాష్ట్రంల పాలిటిక్స్ గిట్ల పీక్స్‌కు బోతుంటే.. మన గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మాత్రం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ల కెళ్ళి అస్సలు బయటకే వస్తలేడు.

గీడ చూస్తే కథ ఏ రేంజ్‌ల నడుస్తుందంటే.. కేసీఆర్ సార్ అరెస్ట్ కాబోతున్నాడనే ముచ్చట బయటకు రాంగనే, కథ మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది. సార్‌కు మద్దతు ఇస్తామని కార్లు వేసుకుని ఎర్రవల్లికి బయల్దేరిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుతో పాటు బీఆర్ఎస్ లీడర్లందరినీ హకీంపేట్ కాడనే సీపీ సుమతి పోలీస్ బలగాలతో అడ్డుకుని, ఈడ్చుకెళ్లి జీపుల పడేసింది.

గట్ల అరెస్ట్ చేసి జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించే దాకా గీడ ఉద్రిక్తత నడుస్తుంటే.. లోపల సార్ మాత్రం ఏం తెలియనట్టు గమ్మగ కూర్చున్నాడు. అసలు ముచ్చట ఏందంటే.. బయట వందలాది పోలీసులు ఫామ్‌హౌస్‌ను చుట్టుముట్టి, సొంత కొడుకు, అల్లుడిని రోడ్ల మీద ఈడ్చుకెళ్తుంటే, కేసీఆర్ సార్ ఎందుకు బయటకు వస్తలేడనేది గిప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. తెలంగాణ తెచ్చిన లీడర్, ఎయిర్‌పోర్టుల ఏ గొడవ జరిగినా ఢిల్లీ దాకా ఊపేసే సార్.. గిప్పుడు ప్రగతి భవన్ పోయి ఫామ్‌హౌస్ వచ్చినాక అస్సలు సౌండ్ జేస్తలేడు.

లీడర్లంతా పోలీస్ స్టేషన్లల ముక్కుతుంటే.. సార్ లోపల కూర్చుని వ్యవసాయం చూసుకుంటున్నాడా, లేక “తమ్ముళ్లూ.. మీ పంచాయితీ ఏదో మీరే తేల్చుకోండి, నన్ను మాత్రం డిస్టర్బ్ జేయకుర్రి” అని లైట్ తీసుకున్నాడా అర్థం కాక గులాబీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు కేసీఆర్ ఒక్క మాట చెప్తే రాష్ట్రం మొత్తం గడగడలాడేది.. కానీ గిప్పుడు ఫామ్‌హౌస్ గేటు ముందర ఇంత రచ్చ జరుగుతున్నా, సార్ ప్రెస్ మీట్ పెట్టడు, కనీసం ఒక్క స్టేట్‌మెంట్ కూడా ఇయ్యడు.

కొంపదీసి లోపల కూర్చుని నెక్స్ట్ గవర్నమెంట్‌ను ఎట్లా పడగొట్టాలనే పెద్ద ‘స్కెచ్’ ఏమైనా గీస్తున్నాడా.. లేక సైలెంట్‌గా ఉండి అవతలి వాళ్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాడా అనేది బీఆర్ఎస్ తమ్ముళ్లకు కూడా తెల్వతలేదు. ఏదేమైనా, “కొడుకు, అల్లుడు జైలుకు పోయినా పర్లేదు కానీ.. నా ఫామ్‌హౌస్ ప్రశాంతత మాత్రం పాడవద్దు” అన్నట్టున్న సార్ తీరు చూసి జనం మాత్రం వెటకారంగా నవ్వుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Rajyam