Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మే 15న "ముసలోడికి దసరా పండుగ" మూవీ విడుదల!

మే 15న "ముసలోడికి దసరా పండుగ" మూవీ విడుదల!

Telugu Rajyam 1 week ago

నాన్‌స్టాప్ నవ్వులు పండించడానికి టాలీవుడ్ తెరపైకి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైన్మెంట్ మూవీ రాబోతోంది. రాజీ నాయుడు - సీతమ్మ వాళ్లె ఆశీస్సులతో రమణా ఫిలిమ్స్ బ్యానర్‌పై యువ నిర్మాత రమణ వాళ్లె నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం "ముసలోడికి దసరా పండుగ" విలక్షణ నటుడు నాజర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం (మే 15న) థియేటర్‌లలో విడుదల కాబోతోంది.

ఇప్పటికే ట్రైలర్ ప్రచార చిత్రాలతో భారీ అంచనాలు అందుకున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాత రమణ వాళ్లె మాట్లాడుతూ.. "ప్రేక్షకులు థియేటర్‌కు వస్తే రెండు గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. సినిమా అవుట్‌పుట్ పట్ల మేము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలం. ఈ సినిమాను మా పితృ సమానులు దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు అంకితమిస్తున్నాం" అని తెలిపారు.

చాలా కాలం తర్వాత తెలుగు తెరపైకి ఫ్యామిలీ ఎమోషన్స్, ఫుల్ లెంగ్త్ కామెడీతో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తారాగణం & సాంకేతిక నిపుణులు
ఈ సినిమాలో నాజర్‌తో పాటు అంజలి (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేం), అనిత (నువ్వు నేను ఫేం), కోవై సరళ, శరణ్య, సత్య వంటి భారీ తారాగణం నటిస్తున్నారు.

బ్యానర్: రమణా ఫిలిమ్స్
నిర్మాత: రమణ వాళ్లె
దర్శకత్వం: డి. మనోహర్
సంగీతం: డి. ఇమాన్
ప్రొడక్షన్ కంట్రోలర్: పానుగంటి సురేష్

సినిమాటోగ్రఫీ: వి. లక్ష్మీపతి
పీఆర్ఓ: అశోక్ దయ్యాల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Rajyam