Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెగా ఫ్యామిలీకి చంద్రబాబు దెబ్బ మీద దెబ్బ..!

మెగా ఫ్యామిలీకి చంద్రబాబు దెబ్బ మీద దెబ్బ..!

Telugu Rajyam 9 hrs ago

చంద్రబాబు రాజకీయ చాణక్యాన్ని అర్థం చేసుకోవడం ఎవరి తరం కాదు బాసూ. నాడు బాబు రాజకీయ వ్యూహాలు తట్టుకోలేక సీనియర్ ఎన్టీఆర్ విలవిలలాడి పైకి పోతే..

నేడు జూనియర్ ఎన్టీఆర్ ఆ దెబ్బకు తట్టుకోలేక సైలెంట్‌గా మౌనముద్ర వేసేశాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి తట్టుకోలేక ఏకంగా దుకాణం మూసేసుకున్నాడు. మరి అలాంటి 'బాస్ ఆఫ్ పాలిటిక్స్' చంద్రబాబు వ్యూహాలను అర్థం చేసుకోవడం పవన్ కళ్యాణ్ లాంటి అమాయక లీడర్ల వల్ల ఏమవుతుంది చెప్పండి..?

ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు, ఆయన కుటుంబానికి బాబు వరుసగా ఇస్తున్న గిఫ్ట్‌లు చూస్తుంటే.. అవి పదవులు లాగా కాకుండా, మెగా ఫ్యామిలీకి రాజకీయంగా వేస్తున్న 'మరణ శాసనాలు' లాగా కనిపిస్తున్నాయంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ భలే వెటకారం ఆడుతున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, ఆయన పెద్దన్నయ్య నాగబాబుకు క్యాబినెట్ ర్యాంక్ చైర్మన్ కుర్చీ కట్టబెట్టారు. అంతటితో ఆగకుండా.. పవన్ వదినకు.. అంటే చిరంజీవి భార్య సురేఖకు తెలంగాణలో ఉన్న తన మిత్రుడు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పి మరీ యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డులో మెంబర్‌షిప్ ఇప్పించారు.

ఇక తాజా ముచ్చటగా చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలను విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించారు. ఇవన్నీ చూసి సామాన్యులు “అబ్బా.. మెగా ఫ్యామిలీకి ఎంతటి అదృష్టం” అని మురిసిపోతుంటే.. పొలిటికల్ విశ్లేషకులు మాత్రం గట్టిగా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే, ఇవన్నీ వారికి పైసా ఉపయోగం లేని నామినేటెడ్ పదవులు కానీ.. రేపు పొద్దున జనాలు “కుటుంబ వారసత్వ రాజకీయం” అంటూ మెగా ఫ్యామిలీని తిట్టుకుని, రాజకీయంగా చావగొట్టడానికి బాబు వేసిన పక్కా స్కెచ్ లాగా ఉందట.

పదవులు ఇచ్చి మరీ రాజకీయంగా ఎలా దెబ్బ తీయవచ్చో చంద్రబాబును చూసి నేర్చుకోవాలని నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన కొత్తలో “నా కుటుంబం నుంచి ఎవ్వరూ రాజకీయాల్లోకి రారు, పదవులు తీసుకోరు” అని కొట్టిన సింహగర్జనను.. బాబు ఇలా వరుసగా జీవోలు ఇచ్చి మరీ తుడిచేస్తున్నాడు. రేపు ఎన్నికలు వచ్చేసరికి “పవన్ కళ్యాణ్ సొంత కుటుంబానికే పదవులు ఇప్పించుకున్నాడు.. కార్యకర్తలకు ఏం చేశాడు..?” అని జనాలు ప్రశ్నించేలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. పవన్ కుటుంబానికి మరో పదవి.. అనే ఈ ఒక్క తాజా న్యూస్ చాలు, మెగా ఫ్యామిలీకి తెలియకుండానే బాబు వెనక నుంచి ఎలాంటి పొలిటికల్ చావదెబ్బ కొడుతున్నాడో అర్థం చేసుకోవడానికి అంటున్నారు పొలిటికల్ అనలిస్ట్ లు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Rajyam