Dailyhunt
పూజాహెగ్డే ఇంట తీవ్ర విషాదం .. ఎమోషనల్ పోస్ట్ !

పూజాహెగ్డే ఇంట తీవ్ర విషాదం .. ఎమోషనల్ పోస్ట్ !

Telugu Rajyam 5 years ago

తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట విషాదం నెలకొంది. తాను అమితంగా ప్రేమించే భామ్మగారు మరణించారు. ఈ విషయాన్ని పూజా స్వయంగా వెల్లడించారు. తాను ఎక్కడ ఉన్నా అక్కడ ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా హాయిగా ఉండాలని పూజా కోరుకుంది. ఈ క్యూటీని మేం కోల్పోయాను.. కష్టాలలో ఉన్నా నవ్వుతూనే ఉండాలని ఆమె మాకు నేర్పించింది భామ్మ. ధైర్యంగా ఉండాలని ఉద్భోధించింది.

కావాల్సిన వారి కోసం ఈగోల్ని వదిలిపెట్టాలని నేర్పించింది.

తాను మా మధ్య లేకపోయినా నాతోనే ఉంటుంది. లవ్ యు ఆజీ..! అంటూ దుఃఖ సాగరంలో మునిగిపోయింది పూజా. షూట్ టైమ్ లో ఫోన్లు చేసి, ఏం చేస్తున్నావ్, ఎలా ఉన్నావ్, అని నువ్వడిగే ప్రశ్నల్ని కాల్స్ ని మిస్సవుతున్నాను భామ్మా, అని ఆవేదనకు గురైంది పూజా నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో పూజా నటించింది. త్వరలోనే ఇవన్నీ రిలీజ్ కి రావాల్సి ఉంది. మరోవైపు బాలీవుడ్ చిత్రాలతోనూ పూజా బిజీగా ఉంది.

పూజా హెగ్డే సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆమె, ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సినిమాను పీరియాడికల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. జూలై 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. దీంతో పాటు అక్కిని అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీలో నటిస్తోంది పూజా.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Rajyam