Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పులివెందుల గెలిచే రండి, మంత్రులకు చంద్రబాబు టార్గెట్..!

పులివెందుల గెలిచే రండి, మంత్రులకు చంద్రబాబు టార్గెట్..!

Telugu Rajyam 1 week ago

రాజకీయాల్లో 'రివెంజ్' అనేది చాలా కామన్‌గా వినిపించే మాటే అయినా.. చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ లీడర్ రూట్ మారిస్తే ఆ లెక్కలు వేరేలా ఉంటాయి.

గత 2021 స్థానిక సంస్థల ఎన్నికల గుర్తుందిగా..? నాడు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కసికట్టి మరీ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంపై దండయాత్ర చేసింది. కుప్పం మున్సిపాలిటీతో పాటు స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేసి బాబుకు గట్టి షాక్ ఇచ్చింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్లు.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

2024లో కూటమి భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు పక్కా రివెంజ్ మోడ్‌లో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. ఈసారి ఎలాగైనా సరే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత కోట అయిన 'పులివెందుల మున్సిపాలిటీ'పై పసుపు జెండా ఎగరేయాలన్నదే చంద్రబాబు సింగిల్ పాయింట్ ఎజెండా అట. రీసెంట్‌గా ఉమ్మడి కడప జిల్లా నేతలతో జరిగిన ఒక ఇంటర్నల్ మీటింగ్‌లో బాబు ఇచ్చిన క్లాస్ ఇప్పుడు పీక్స్ కి చేరింది. “పులివెందుల మున్సిపాలిటీని గెలిపించిన తర్వాతే మీరు నన్ను కలవడానికి అమరావతి టీడీపీ ఆఫీస్‌కు రావాలి.. అంతవరకు నాకు ముఖం చూపించొద్దు” అంటూ కడప తమ్ముళ్లకు చంద్రబాబు అల్టిమేటం జారీ చేసినట్లు భోగట్టా.

బాబు నోటి నుంచి ఇంత ఘాటుగా ఆర్డర్స్ వచ్చాయంటే క్షేత్రస్థాయిలో స్కెచ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆపరేషన్ పులివెందుల కోసం చంద్రబాబు ఒక సాదాసీదా ప్లాన్ కాకుండా.. ఏకంగా హెవీ వెయిట్ టీమ్‌ను రంగంలోకి దించినట్లు ఇన్‌సైడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. కడప జిల్లాకు చెందిన ముగ్గురు కీలక మంత్రులతో పాటు ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పులివెందుల మున్సిపల్ ఎన్నికల పూర్తి బాధ్యతలను అప్పగించారట. ప్రతీ వార్డుకూ ఒక ఇన్ఛార్జ్‌ను పెట్టి, క్షేత్రస్థాయిలో వైసీపీ క్యాడర్‌ను డ్యామేజ్ చేసేలా పక్కా స్ట్రాటజీ రన్ అవుతోంది. నాడు కుప్పంలో వైసీపీ చేసిన దానికి.. నేడు పులివెందులలో అంతకు వడ్డీతో కలిపి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయిన కూటమి సర్కార్.. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎలాంటి భీభత్సం సృష్టించబోతోందో చూడాలి మరి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Rajyam