Dailyhunt
'రాకాస' చిత్రాన్ని ఇంకా చూడని వాళ్లు వెంటనే చూడండి.. సమ్మర్ ఫన్‌టాస్టిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో హిట్ మెషిన్ అనిల్ రావిపూడి

'రాకాస' చిత్రాన్ని ఇంకా చూడని వాళ్లు వెంటనే చూడండి.. సమ్మర్ ఫన్‌టాస్టిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో హిట్ మెషిన్ అనిల్ రావిపూడి

Telugu Rajyam 1 week ago

Raakaasa: జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం 'రాకాస'.

ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్‌, నయన్ సారిక జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు సమ్మర్ ఫన్‌టాస్టిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌కి హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..

*అనిల్ రావిపూడి మాట్లాడుతూ ..* ''రాకాస' టీంకి బిగ్ కంగ్రాట్స్. ఈ చిత్రాన్ని ఇంకా చూడని వాళ్లు వెంటనే చూడండి. నిహారిక చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఓ మూవీని ఆడియెన్స్‌కి ఎంత వరకు రీచ్ చేయాలో, ఎలా ప్రమోషన్స్ చేయాలో అన్నీ చేశారు. ఐపీఎల్ సీజన్‌లోనూ 'రాకాస' కోసం ఆడియెన్స్ వస్తుండటం గొప్ప విషయం. కామెడీ ఉంటే జనాలు కచ్చితంగా థియేటర్‌కు వచ్చి సినిమాని చూస్తారు. నేను ఇంకా ఈ మూవీని చూడలేదు. కాకపోతే చాలా ఎపిసోడ్స్ చూశాను. అవి చూస్తేనే సంగీత్, గెటప్ శ్రీను, నయన్, వెన్నెల కిషోర్ గారి కామెడీ చూసి పగలబడి నవ్వేశాను. అనుదీప్ బీజీఎం, పాటలు బాగున్నాయి. ఓ అమ్మాయి (మానస శర్మ) డైరెక్టర్‌గా వచ్చి ఇంకో అమ్మాయి (నిహారిక) నిర్మాతగా నిలబడి.. బ్లాక్ బస్టర్ కొట్టారంటే హ్యాట్సాఫ్. వారిద్దరూ అలా ముందుకు వెళ్తూనే ఉండాలి. మానస శర్మ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. సంగీత్ ఇలానే కంటిన్యూగా విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. సమ్మర్‌లో రాబోతోన్న అన్ని చిత్రాల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Rajyam