Dailyhunt
Rachamallu - Chandrababu: చంద్రబాబుపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిప్పులు

Rachamallu - Chandrababu: చంద్రబాబుపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిప్పులు

Telugu Rajyam 0 months ago

Rachamallu - Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం చుట్టూ జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక భారీ కుంభకోణమని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దేవతల రాజధాని కడతామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతూ, తెరవెనుక భారీ భూ దోపిడీకి తెరలేపారని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో రైతుల పొట్ట కొట్టారని వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కీలక విమర్శలు.

బంగారం పండే 50 వేల ఎకరాల భూములను రైతుల నుంచి దుర్మార్గంగా లాక్కున్నారని, రాజధాని నిర్మాణం కంటే భూముల క్రయవిక్రయాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు. రెండు లక్షల కోట్లతో రాజధాని కడతామన్న చంద్రబాబు, గడిచిన ఏడేళ్లలో కేవలం 80 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. ఇదే వేగంతో వెళ్తే అమరావతి పూర్తి కావడానికి మరో 200 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. చదరపు అడుగుకు రూ. 4 వేలు ఖర్చయ్యే నిర్మాణాలకు రూ. 14 వేలు ఖర్చవుతున్నట్లు తప్పుడు లెక్కలు చూపిస్తూ నిధులు దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు.

అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా మారుస్తామని చెప్పి, ప్రభుత్వం ఇప్పటికే వేల కోట్ల రూపాయల అప్పులు చేసిందని రాచమల్లు పేర్కొన్నారు. ఇదంతా కేవలం బేతాళ కథల చందంగా సాగుతోందని, చంద్రబాబు హయాంలో రాజధాని నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదని ఆయన స్పష్టం చేశారు.

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి: “అమరావతి నిర్మాణం అనేది ఒక భ్రమ. పేదల భూములను లాక్కొని పెత్తందార్లకు కట్టబెట్టే కుట్ర ఇది. తమ ప్రభుత్వం వచ్చాక అన్ని విషయాలపై నిజానిజాలు బయటకు వస్తాయి.”

రాజధాని గ్రామాల రైతులను తప్పుదోవ పట్టించి చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం అమరావతిని వాడుకుంటున్నారని, రానున్న రోజుల్లో దీనిపై ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Rajyam