Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేయ్ ఇక 'అల్లరి' పేరు మార్చేయ్ .. నాని సలహా !

రేయ్ ఇక 'అల్లరి' పేరు మార్చేయ్ .. నాని సలహా !

Telugu Rajyam 5 years ago

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ మూవీస్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న అల్లరి నరేష్ గత 8 ఏళ్ళలో విజయం లేకుండా ఎంతగా కష్టపడ్డాడో అందరికి తెలిసిందే. సుడిగాడుతో వచ్చిన 10కోట్ల మార్కెట్ ను ఆ తరువాత కొన్ని సినిమాల వల్ల కోల్పోవాల్సి వచ్చింది. మార్కెట్ సంగతి పక్కన పెడితే ఎలాంటి సినిమా చేసినా కూడా పాజిటివ్ టాక్ ను అందుకోలేకపోయింది. ఇక కామెడీ జానర్ ను పక్కన పెట్టి నాంది సినిమాతో చేసిన సరికొత్త థ్రిల్లర్ జనర్ నరేష్ ను ట్రాక్ లోకి తీసుకొచ్చింది.

ఇక సినిమా సక్సెస్ పై హీరో నాని కూడా స్పందించాడు. భవిష్యత్తంతా బంగారుబాటే అన్న సంకేతాలిస్తూ.. నరేష్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు నాని ట్వీట్ చేస్తూ..

"మొత్తానికి 'నాంది' సినిమా చూశాను. రేయ్‌ రేయ్‌ రేయ్‌.. 'అల్లరి నరేష్‌' పేరు మార్చేయ్‌ ఇంక.. అల్లరి గతం.. భవిష్యత్తుకు ఇది నాంది. ఒక గొప్ప నటుడిని నీలో చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఇకపై ఇలాంటివి నీ నుంచి మరిన్ని రావాలని కోరు కుంటున్నాను.." అని నాని పోస్ట్ చేశారు.

దీంతో అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. కాగా గమ్యం సినిమాలోని గాలి శ్రీను క్యారెక్టర్‌తో తన నటనను మరింత ఎత్తుకు తీసుకెళ్లిన అల్లరి నరేష్‌ తాజా చిత్రం నాంది. ఎస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించిన నాంది మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే హీరో నాని చేసిన ట్వీట్ ఇపుడు వైరల్‌గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Rajyam