తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ మూవీస్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న అల్లరి నరేష్ గత 8 ఏళ్ళలో విజయం లేకుండా ఎంతగా కష్టపడ్డాడో అందరికి తెలిసిందే. సుడిగాడుతో వచ్చిన 10కోట్ల మార్కెట్ ను ఆ తరువాత కొన్ని సినిమాల వల్ల కోల్పోవాల్సి వచ్చింది. మార్కెట్ సంగతి పక్కన పెడితే ఎలాంటి సినిమా చేసినా కూడా పాజిటివ్ టాక్ ను అందుకోలేకపోయింది. ఇక కామెడీ జానర్ ను పక్కన పెట్టి నాంది సినిమాతో చేసిన సరికొత్త థ్రిల్లర్ జనర్ నరేష్ ను ట్రాక్ లోకి తీసుకొచ్చింది.
ఇక సినిమా సక్సెస్ పై హీరో నాని కూడా స్పందించాడు. భవిష్యత్తంతా బంగారుబాటే అన్న సంకేతాలిస్తూ.. నరేష్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు నాని ట్వీట్ చేస్తూ..
దీంతో అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. కాగా గమ్యం సినిమాలోని గాలి శ్రీను క్యారెక్టర్‌తో తన నటనను మరింత ఎత్తుకు తీసుకెళ్లిన అల్లరి నరేష్ తాజా చిత్రం నాంది. ఎస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించిన నాంది మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే హీరో నాని చేసిన ట్వీట్ ఇపుడు వైరల్‌గా మారింది.

