Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
148 బంతుల్లో వన్డే సెంచరీ.. తిలక్ వర్మ ఖాతాలో చెత్త రికార్డు..!

148 బంతుల్లో వన్డే సెంచరీ.. తిలక్ వర్మ ఖాతాలో చెత్త రికార్డు..!

Telugu Samayam 55 mins ago

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో ఆదివారం పాకిస్థాన్-ఏతో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో భారత్-ఏ కెప్టెన్ తిలక్ వర్మ సెంచరీ సాధించినా, అది అనవసర రికార్డుల పుస్తకంలోకి ఎక్కింది.

148 బంతుల్లో శతకం పూర్తి చేసిన తిలక్, లిస్ట్-ఏ క్రికెట్‌లో భారత్ తరఫున రెండో అత్యంత నెమ్మదైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో భారత మాజీ ఆటగాడు మనోజ్ ప్రభాకర్ (151 బంతుల్లో సెంచరీ) మాత్రమే తిలక్ కంటే ముందున్నాడు. 314 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్-ఏ 265 పరుగులకే ఆలౌట్ అయి 48 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఈ మ్యాచులో ఓపెనర్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మల ఆటతీరు పూర్తి భిన్నంగా సాగింది. అభిషేక్ 42 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 70 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అయితే ఇదే సమయంలో తిలక్ పరుగులు తీసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఒక దశలో అభిషేక్ 34 బంతుల్లో 60 పరుగులకు దూసుకెళ్తే, తిలక్ అదే 34 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. తన అర్ధశతకాన్ని పూర్తి చేయడానికే తిలక్ ఏకంగా 95 బంతులు తీసుకున్నాడు.


తిలక్ స్లోగా బ్యాటింగ్ చేయడంతో సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగి మిడిల్ ఆర్డర్‌పై తీవ్ర ఒత్తిడి పడింది. అభిషేక్ శర్మ అవుటైన తర్వాత వచ్చిన బ్యాటర్లు పాకిస్థాన్ బౌలర్ల ధాటికి వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. దీంతో భారత్-ఏ ఇన్నింగ్స్ కష్టాల్లో పడింది.

ఇన్నింగ్స్ చివరి దశలో కొన్ని బౌండరీలు బాదిన తిలక్ వర్మ, షాబాజ్ అహ్మద్‌తో కలిసి ఏడో వికెట్‌కు 112 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. షాబాజ్ 41 బంతుల్లో 56 పరుగులతో రాణించినప్పటికీ, 43వ ఓవర్లో అతడు అవుటవడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. చివరకు 49.1 ఓవర్లలో 265 పరుగులకు భారత్-ఏ కుప్పకూలింది. దీంతో తిలక్ సెంచరీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. ఇక దాయాదుల మధ్య జరిగిన ఈ మ్యాచులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కవ్వింపు చర్యలు చోటు చేసుకున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam