Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
18 ఏళ్లకే సినీ ఆఫర్.. అమ్మానాన్నల ధైర్యమే నన్ను ఇక్కడిదాకా తెచ్చింది: ప్రీతి ముకుందన్

18 ఏళ్లకే సినీ ఆఫర్.. అమ్మానాన్నల ధైర్యమే నన్ను ఇక్కడిదాకా తెచ్చింది: ప్రీతి ముకుందన్

Telugu Samayam 1 month ago

టీవల 'బ్లాస్ట్' మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకున్న హీరోయిన్ ప్రీతి ముకుందన్ తన సినీ ప్రయాణం వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తాను నటనను వృత్తిగా ఎంచుకోవడంలో తల్లిదండ్రుల మద్దతు ఎంతో కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తొలి ఆడిషన్‌ నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

విద్యాభ్యాసానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే కుటుంబం నుంచి తాను ఇండస్ట్రీకి వచ్చినట్లు ప్రీతి తెలిపారు. చదువు విషయంలో ఎంత శ్రద్ధ చూపే వారో, తన ఇష్టాలకు కూడా తల్లిదండ్రులు అంతే విలువ ఇచ్చేవారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తొలుత మోడలింగ్ రంగానికి పరిచయమయ్యారు. పద్దెనిమిదేళ్ల వయసులో ఉండగా మొదటిసారిగా ఒక సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది. అయితే, ఆ సమయంలో నటనపై సరైన అవగాహన, నమ్మకం లేకపోవడంతో ఆడిషన్‌కు వెళ్లేందుకు నిరాకరించినట్లు చెప్పారు. కానీ, తల్లిదండ్రులు ఆమెకు ధైర్యం చెప్పి, ఒకసారి ప్రయత్నిస్తే తప్పేంటని ప్రోత్సహించారు. వారందిచిన ఆత్మవిశ్వాసంతో ఆడిషన్‌కు హాజరైనప్పటికీ, ఆ పాత్ర లభించలేదు. అయినప్పటికీ, ఆ సంఘటన తనలో కొత్త భరోసాను నింపిందని ప్రీతి చెప్పారు. తమ కుటుంబానికి సినీ పరిశ్రమ గురించి ఎలాంటి అవగాహన లేకపోయినా, నచ్చిన మార్గంలో ప్రయాణించమని అండగా నిలబడటంతోనే తన రంగుల ప్రపంచ ప్రయాణం మొదలైందని వెల్లడించారు. ఆ తర్వాతే నటనపై ఆసక్తి పెరిగి, సినిమాలను అమితంగా ప్రేమించడం మొదలుపెట్టినట్లు చెప్పారు.

* 'లెనిన్' జోష్‌లోనే అఖిల్ షాకింగ్ డెసిషన్.. 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్‌తో నెక్స్ట్ మూవీ?

గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌కు బంధువైన ప్రీతి ముకుందన్ తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించారు. అక్కడి ప్రసిద్ధ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. చిన్నతనం నుంచే నాట్యంపై మక్కువ పెంచుకున్న ఆమె, భరతనాట్యంలో శిక్షణ పొందడమే కాకుండా హిప్‌హాప్, కాంటెంపరరీ వంటి ఆధునిక నృత్య రీతుల్లోనూ శిక్షణ పొందారు. సినీ రంగానికి రాకముందు వందకు పైగా టీవీ ప్రకటనలు, ప్రింట్ యాడ్స్‌లో మోడల్‌గా అలరించారు.

మోడలింగ్ రంగంలో మెరిసిన తర్వాత శ్రీవిష్ణు కథానాయకుడిగా వచ్చిన హారర్-కామెడీ చిత్రం 'ఓం భీమ్ బుష్' (2024)తో ప్రీతి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తమిళంలో కవిన్ సరసన 'స్టార్' చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన పాన్ ఇండియా పౌరాణిక చిత్రం 'కన్నప్ప'లో నెమలి పాత్రతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. 'ఆశా కూడ' లాంటి మ్యూజిక్ ఆల్బమ్స్‌తో సోషల్ మీడియాలోనూ మంచి ప్రజాదరణ పొందారు. ఇటీవల 'బ్లాస్ట్', 'హృదయం మురళీ' వంటి చిత్రాల్లో భిన్నమైన పాత్రలతో మెప్పించిన ఆమె, నటిగా చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. ప్రీతి ప్రస్తుతం తెలుగులో రోషన్ మేక సరసన 'ఏమో ఏమో ఇది' అనే చిత్రంలో నటిస్తున్నారు. 'హిట్' సిరీస్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam