2026 January Calendar Telugu ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే మొదటి నెల జనవరి (January 2026). ఈ జనవరి నెలలో 31 రోజులు ఉంటాయి. ఈ నెలలో మెదటి రోజు అంటే జనవరి 1 నుంచి ఆంగ్ల సంవత్సరం (Telugu Calendar 2026) ప్రారంభమవుతుంది.
ఈ నెలలోనే తెలుగు రాష్ట్రాల్లో విశిష్టంగా జరుపుకునే సంక్రాంతి (Sankranti 2026) పండుగ కూడా వస్తుంది. అలాగే జనవరి 26 గణతంత్ర దినోత్సవం కూడా ఈ నెలలోనే. ఇవే కాకుండా 2026 జనవరి (January 2026) నెలలో స్వామి వివేకానంద జయంతి, సంకటహర చతుర్థి, రథసప్తమి వంటి పర్వదినాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో January 2026 నెలలో ఉండే ముఖ్యమైన పండుగలు (2026 Festivals List), పర్వదినాలు, అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి తేదీలు తెలుసుకుందాం.. అనంతరం ఫిబ్రవరి 2026 నెల పండుగలు, సెలవులు గురించి తెలుసుకుందాం.
2026 జనవరి నెల పండుగలు, ముఖ్యమైన పర్వదినాలు
జనవరి 3 శనివారం : పౌర్ణమి, పౌర్ణమి వ్రతం, శ్రీ సత్యనారాయణ పూజ
జనవరి 6 మంగళవారం : సంకటహర చతుర్థి
జనవరి 11 ఆదివారం : ఉత్తరాషాఢ కార్తె
జనవరి 12 సోమవారం : స్వామి వివేకానంద జయంతి, నేషనల్ యూత్ డే
జనవరి 14 బుధవారం : భోగి పండుగ
జనవరి 15 గురువారం : ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం, మకర సంక్రాంతి
జనవరి 16 శుక్రవారం : కనుమ పండుగ
జనవరి 17 శని వారం: మాస శివరాత్రి, ప్రదోష వ్రతం
జనవరి 18 ఆదివారం : అమావాస్య (చొల్లంగి అమావాస్య)
జనవరి 19 సోమవారం : మాఘమాసం ప్రారంభం
జనవరి 23 శుక్రవారం : సరస్వతి పూజ , నేతాజీ జయంతి
జనవరి 24 శనివారం : శ్రావణ కార్తె , స్కంద షష్టి
జనవరి 25 ఆదివారం : రథసప్తమి
జనవరి 26 సోమవారం : భీష్మాష్టమి, రిపబ్లిక్ డే
జనవరి 29 గురువారం : జయ ఏకాదశి
జనవరి 30 శుక్రవారం : మహాత్మాగాంధీ వర్ధంతి , ప్రదోష వ్రతం
2026 January Purnima - Amavasya Dates
అమావాస్య తిథి జనవరి 18వ తేదీ 12:04 am నుంచి జనవరి 19 వ తేదీ 1:21am వరకు
Ekadashi Tithi in January 2026
శుక్ల పక్ష ఏకాదశి - జనవరి 28వ తేదీ 4:36 pm నుంచి జవనరి 29వ తేదీ 1:55 pm వరకు
2026 జనవరి - రాహుకాలం సమయం
సోమవారం - 07.30 - 09.00 AM
మంగళవారం - 03.00 - 04.30 PM
బుధవారం - 12.00 - 01.30 PM
గురువారం - 01.30 - 03.00 PM
శుక్రవారం - 10.30 - 12.00 PM
శనివారం - 09.00 - 10.30 AM
2026 జనవరి దుర్ముహూర్తము
సోమవారం - 12:31 PM నుంచి 01:14 PM వరకు, 02:42 PM నుంచి 03:26 PM వరకు
మంగళవారం - 08:52 AM నుంచి 09:35 AM వరకు, 10:51 PM నుంచి 11:43 PM వరకు
బుధవారం - 11:48 AM నుంచి 12:31 PM వరకు
గురువారం - 10:20 AM నుంచి 11:04 AM వరకు, 02:43 PM నుంచి 03:27 PM వరకు
శుక్రవారం - 08:49 AM నుంచి 09:33 AM వరకు, 12:29 PM నుంచి 01:13 PM వరకు
శనివారం - 08:06 AM నుంచి 08:50 AM వరకు
ముఖ్య గమనిక: ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆయా ప్రదేశాలు, ప్రాంతాలను బట్టి మారే అవకాశం ఉంది. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.

