తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా శివాజీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ప్రయాణం మొదలుపెట్టి, హీరోగా మారి, రాజకీయ విశ్లేషకుడిగా తనదైన ముద్ర వేసిన శివాజీ..
తాజా ఇంటర్వ్యూలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి, ఏపీ రాజకీయ పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
* వైల్డ్ లుక్‌లో భయపెడుతోన్న బన్నీ.. అట్లీ- అల్లు అర్జున్ మూవీ టైటిల్ ఇదే
మెగా బ్రదర్స్ రాజకీయ ప్రస్థానంపై శివాజీ తనదైన శైలిలో విశ్లేషించారు. చిరంజీవి గారు సరైన సమయంలో రాజకీయాల్లోకి రాలేదేమో అని శివాజీ అభిప్రాయపడ్డారు. ఒకవేళ రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయ ఎంట్రీ ఇచ్చి ఉంటే కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవారని పేర్కొన్నారు. అలాగే చిరంజీవి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారని, తోటి నటులను ఎంతో గౌరవిస్తారని ఆయన స్వభావాన్ని కొనియాడారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పట్టువదలని విక్రమార్కుడిలా నిలబడటం వల్లే రాజకీయాల్లో ఈ స్థాయి విజయం సాధించారని శివాజీ తెలిపారు. అయితే వ్యక్తిగత స్వభావం రీత్యా పవన్ చాలా లిమిటెడ్‌గా మాట్లాడతారని, ఆయనతో తాను రెండు సినిమాలు చేసినప్పటికీ పరిచయం కేవలం 'హాయ్, హలో' వరకే పరిమితమని చెప్పారు. పవన్ అందరితో ఎక్కువగా మింగిల్ అవ్వరని శివాజీ అభిప్రాయపడ్డారు.
* 'నీ రామ్‌ని దూరం చేశాను.. క్షమించు'.. మృణాల్ ఠాకూర్‌కి సారీ చెప్పిన సుమంత్!
శివాజీ గతంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా పోరాటం చేశారు. అయితే మధ్యలో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా ఇటీవల హీరోయిన్ల వస్త్రధారణపై ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించినప్పటికీ, శివాజీ మాత్రం తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు విజన్‌పై విశ్వాసం వ్యక్తం చేస్తూ, అమరావతి భవిష్యత్తులో దుబాయ్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
జెమిని టీవీలో యాంకర్‌గా మొదలైన శివాజీ ప్రయాణం, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి మలుపు తీసుకుంది. ముఖ్యంగా 'నితిన్' (దిల్) వంటి హీరోలకు ఆయన చెప్పిన డబ్బింగ్ చాలా పాపులర్ అయింది. 'ఖుషి', 'ఇంద్ర' వంటి పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన శివాజీ, 'మిస్సమ్మ' (2003) సినిమాతో సోలో హీరోగా భారీ విజయాన్ని అందుకున్నారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన శివాజీ కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చారు. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొని తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకున్నారు. హౌస్‌లో ఆయన చూపించిన మెచ్యూరిటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో 'కోర్టు' మూవీలో ఆయన చేసిన మంగపతి పాత్ర ప్రశంసలు అందుకుంది. ఇటీవల దండోరా, సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన మరికొన్ని చిత్రాల్ని లైన్లో పెట్టి బిజీ ఆర్టిస్టుగా మారిపోయారు.

