Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు .. ఇప్పుడు పెడబొబ్బలా? : వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు .. ఇప్పుడు పెడబొబ్బలా? : వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

Telugu Samayam 6 hrs ago

ఏపీ స్థానిక ఎన్నికల సంస్థల ఎన్నికల ప్రక్రియపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన విమర్శలపై సీఎం చంద్రబాబునాయుడు రియాక్ట్ అయ్యారు.

అధికారంలో ఉన్నప్పుడు దాడులు, అరాచకాలతో స్థానిక ఎన్నికలను ఏకపక్షంగా మార్చుకున్న వైసీపీ... ఇప్పుడు పారదర్శకత గురించి పెడబొబ్బలు పెట్టడం విడ్డూరంగా ఉందని చంద్రబాబునాయుడు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా పిఠాపురంతో పాటు కొన్ని కీలకమైన ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసిన విషయం జగన్ తెలుసుకోవాలని చంద్రబాబు అన్నారు.

అదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా టీడీపీ నాయకులు నామినేషన్లు వేసే పరిస్థితిని కల్పించారా? అని ప్రశ్నించారు. అధికారం పోయినా దౌర్జన్యం ఎన్నికల్లో గెలవాలని జగన్ చూస్తున్నారని, ఈ పద్ధతి మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు.


గంజాయి బ్యాచ్ వర్సెస్ విద్యావంతులు..?

అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గంజాయి బ్యాచ్ వర్సెస్ విద్యావంతులు, రౌడీ మూకలు వర్సెస్ యువత అన్నట్టుగా పోటీ నెలకొందని సీఎం చంద్రబాబునాయుడు అభివర్ణించారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు విధానాలతో పాలన సాగిస్తున్న కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా తమ పార్టీలో అంకితభావంతో పని చేసినవారితో పాటు ప్రజలు మెచ్చిన అభ్యర్థులకే స్థానిక ఎన్నికల్లో అవకాశమిచ్చామని సీఎం తెలిపారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ వర్గాలకు కలిపి 63.3 శాతం సీట్లు కేటాయించామని, ఇందులో బీసీలకే 35 శాతానికి పైగా స్థానాలు దక్కాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.

గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఎదుగుతున్న రాయలసీమ..

ఫ్యాక్షన్ పాలిటిక్స్‌తో నలిగిపోయిన రాయలసీమ... ఇప్పుడు 'గ్రీన్ ఎనర్జీ హబ్'గా దేశానికే ఆదర్శంగా ఎదుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. రాయలసీమను రత్నాల సీమగా మారుస్తామన్నారు. 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వమే మళ్లీ శ్రీకారం చుట్టి నీరందించిందని గుర్తు చేశారు. రాయలసీమకే కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో గోదావరిలో మునిగిపోయిన పోలవరం డయాఫ్రం వాల్ నష్టాన్ని అధిగమించి.. పనులు వేగవంతంగా చేయిస్తున్నామని తెలియజేశారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam