Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అఫ్ఘాన్‌పై 170 పరుగుల తేడాతో భారత్ విక్టరీ.. వన్డే సిరీస్ కైవసం..!

అఫ్ఘాన్‌పై 170 పరుగుల తేడాతో భారత్ విక్టరీ.. వన్డే సిరీస్ కైవసం..!

Telugu Samayam 11 hrs ago

ఫ్ఘానిస్థాన్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఛేజిక్కించుకుంది. బుధవారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్..

170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విజయంతో భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నామమాత్రపు మూడో వన్డే జూన్ 20న చెన్నైలో జరగనుంది.


రెగ్యులర్‌గా ఓపెనింగ్ స్థానంలో వచ్చే శుభ్‌మన్ గిల్.. తన ప్లేసును యశస్వి జైశ్వాల్‌కు త్యాగం చేశాడు. అయితే జైశ్వాల్ మాత్రం తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక, 9 బంతుల్లో 4 రన్స్ మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. 110 బంతుల్లో 154 రన్స్ చేశాడు. ఇషాన్ కిషన్ సైతం 79 బంతుల్లో 125 పరుగులు చేయడంతో భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయింది. అఫ్ఘానిస్థాన్ బౌలర్లలో కరోటీ 4, రషీద్ ఖాన్ 3 వికెట్లు తీయగా.. ఘజన్‌ఫర్, సలీమ్ సఫీ ఒక్కో వికెట్ తీశారు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘానిస్థాన్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.
భారత బౌలర్ల దెబ్బకు ఆ జట్టు బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివరకు అఫ్ఘాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 170 పరుగుల తేడాతో భారత్ విక్టరీ నమోదు చేసింది. రెహ్మత్ షా (89 బంతుల్లో 79 రన్స్‌) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ చెరో మూడు వికెట్లు తీశారు. అరంగేట్ర పేసర్ ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లతో సత్తాచాటాడు. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ పడగొట్టాడు.

అఫ్ఘానిస్థాన్ జట్టు.. ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు భారత్‌కు వచ్చింది. ఏకైక టెస్టులో చిత్తుగా ఓడిన ఆ జట్టు.. వన్డే సిరీస్‌లోనూ వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి సిరీస్ కోల్పోయింది. నామమాత్రపు మూడో వన్డే జూన్ 20న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam