నేషనల్ క్రష్ రష్మిక మందానా పెళ్లయిన తర్వాత తొలిసారి తన పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ భార్య కోసం ఒక స్పెషల్ వీడియోను షేర్ చేస్తూ..
"ఐ లవ్ యూ జయమ్మ" అంటూ తన ప్రేమను కురిపించారు. రష్మికను కేవలం భార్యగానే కాకుండా, తను నటిస్తున్న పాత్ర పేరుతో పిలుస్తూ విష్ చేయడం అభిమానులకు కిక్కిస్తోంది.
* ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించా.. నా పుట్టినరోజున కోలుకోలేని షాకిచ్చింది - అడివి శేష్
ప్రస్తుతం విజయ్ - రష్మిక జంటగా 'రణబాలి' అనే భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, రష్మిక 'జయమ్మ' అనే అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపిస్తోంది. రష్మిక పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె పాత్రకు సంబంధించిన ఒక స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఆ వీడియోలో జయమ్మ లుక్, మేకప్, ఆమె వేసుకున్న సంప్రదాయ నగలు చూస్తుంటే, రష్మిక కెరీర్‌లోనే ఇది ఒక ఐకానిక్ పాత్ర అవుతుందని అర్థమవుతోంది. ఈ వీడియోనే విజయ్ షేర్ చేస్తూ తన ప్రేమను వ్యక్తపరిచారు.
* రేణు దేశాయ్‌పై బూతు కామెంట్స్.. ట్రోలర్స్ తాట తీసిన పోలీసులు, ఆరుగురి అరెస్ట్
కేవలం ప్రేమకథగానే కాకుండా, 19 వ శతాబ్దపు భారతీయ చరిత్ర నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. 1854 నుండి 1878 మధ్య బ్రిటిష్ వలస పాలనలో భారతీయులు పడిన అణచివేతను , దానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. బ్రిటిష్ అధికారులు సర్ రిచర్డ్ టెంపుల్, సర్ థియోడర్ హెక్టర్ వంటి వారి క్రూరత్వాన్ని ఎదిరించే విప్లవ వీరుడిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు . ప్రస్తుతం అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇక రష్మిక కెరీర్ విషయానికొస్తే ... కన్నడ నాట 'కిరిక్ పార్టీ'తో ప్రయాణం మొదలుపెట్టిన రష్మిక మందానా తెలుగులో 'ఛలో'తో ఇక్కడి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆ తర్వాత 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక 'పుష్ప', 'యానిమల్', 'ఛావా' వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగింది. గతేడాది 'కుబేర', 'ది గర్ల్‌ఫ్రెండ్' వంటి చిత్రాలతో విజయాలు అందుకున్న రష్మిక ప్రస్తుతం 'రణబాలి', 'మైసా' చిత్రాల్లో నటిస్తోంది. పెళ్లి తర్వాత కూడా రష్మిక వరుస విజయాలు అందుకుంటూ స్టార్‌డమ్ కొనసాగించాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

