Dailyhunt
ఐపీఎల్ 2026లో ఛేజింగ్ జట్లదే హవా.. 5 మ్యాచ్‌ల తర్వాత పాయింట్స్ టేబుల్ ఎలా ఉందంటే..!

ఐపీఎల్ 2026లో ఛేజింగ్ జట్లదే హవా.. 5 మ్యాచ్‌ల తర్వాత పాయింట్స్ టేబుల్ ఎలా ఉందంటే..!

Telugu Samayam 1 week ago

పీఎల్ 2026లో ఐదు లీగ్ మ్యాచులు పూర్తయ్యాయి. మొత్తం పది జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. అయితే ఐదు మ్యాచుల తర్వాత.. కనీసం అన్ని జట్లూ ఒక్కో మ్యాచులో తలపడ్డాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఏ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

సన్ రైజర్స్‌పై ఆర్సీబీ విక్టరీ..

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచులో ఆర్సీబీ అదరగొట్టింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి.. బోణీ కొట్టింది.

ముంబై మురిసే..

గత 2-3 సీజన్‌లుగా ఆశించిన మేర రాణించలేకపోతున్న ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026ను ఘనంగా ఆరంభించింది. రోహిత్ శర్మ వింటేజ్ ఆటతో అలరించడంతో కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేజ్ చేసింది.

తడబడిన చెన్నై..

ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సీఎస్కే తొలి మ్యాచులో చిత్తుగా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసి 127 పరుగులకు కుప్ప కూలింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్.. 12.1 ఓవర్లలోనే మ్యాచ్ ముగించి తొలి విజయాన్ని నమోదు చేసింది.

తొలి ఉత్కంఠ పోరు..

గుజరాత్, పంజాబ్ మధ్య ఉత్కంఠ భరితంగా మ్యాచ్ సాగింది. ఈ లో స్కోరింగ్ గేమ్‌లో పంజాబ్.. చివరి ఓవర్‌లో విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేజ్ చేసింది. ఓడినా గుజరాత్ చివరి వరకూ పోరాడింది.

సమీర్ రిజ్వీ షో..

లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తుగా ఓడించింది. 142 పరుగుల లక్ష్య ఛేదనలో ఓ దశలో 26/4తో నిలిచినా.. సమీర్ రిజ్వీ అజేయ హాఫ్ సెంచరీతో గ్రాండ్ విక్టరీ సాధించింది. విజయంతో టోర్నీని ఆరంభించింది.

ఇక ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచులలో ఛేజింగ్ చేసిన జట్టే గెలుపొందడం గమనార్హం. ఇందులో తొలి నాలుగు మ్యాచులలో హోం టీమ్ గెలవగా.. మరో మ్యాచులో లక్నోలో ఆడిన మ్యాచులో ఢిల్లీ గెలిచింది. ఐపీఎల్ 2026లో తొలి రెండు మ్యాచులలో భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. కానీ ఇప్పుడు బౌలర్లు కూడా సత్తాచాటుతున్నారు. దీంతో మ్యాచులు ఉత్కంఠ భరితంగా మారిపోయాయి.

పాయింట్స్ టేబుల్ ఎలా ఉందంటే..

మరోవైపు పాయింట్స్ టేబుల్‌లో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఆర్సీబీ, డీసీ, ముంబై, పంజాబ్ కింగ్స్.. ఆ తర్వాతి స్థానాల్లో నిలిచింది. గుజరాత్ 6, కేకేఆర్ 7, లక్నో 8, సన్ రైజర్స్ 9వ ప్లేసులో నిలిచాయి. చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగు స్థానమైన పదో ప్లేసులో ఉంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam