Airtel Rs 200 Plan: భారత్‌లోని ప్రముఖ టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ తమ యూజర్ల కోసం మరో కొత్త రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. కేవలం రూ.200లతోనే అన్‌లిమిటెడ్ 5జీ డేటా అందించే ప్రీపెయిడ్ యాడ్-ఆన్ ప్యాక్ తీసుకొచ్చింది.
ఈ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్ సిమ్ యూజర్లకు 30జీబీ డేటా లభిస్తుంది. 28 రోజుల పాటు ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఉంటుంది. వీటితో పాటు ఎంటర్‌టైన్మెంట్ బెనిఫిట్స్ అన్‌లిమిటెడ్ 5జీ డేటా ప్రయోజనాలు లభిస్తాయి. మరి ఈ ప్లాన్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.
వినోదాన్ని ఆస్వాదించే కస్టమర్లే లక్ష్యంగా ఈ ప్రీపెయిడ్ యాడ్ ఆన్ ప్లాన్‌ను భారతీ ఎయిర్‌టెల్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ప్రధాంగా అదనపు డేటా, ప్రీమియం ఓటీటీ (OTT) ప్లాట్ ఫారాల కంటెంట్ యాక్సెస్ చేయాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుని రూపొందించినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. ఇది ఒక యాడ్-ఆన్ ప్యాక్. అంటే ఈ ప్లాన్ వర్తించాలంటే ఏదైనా బేస్ ప్లాన్ యాక్టివ్‌గా ఉండాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా 30జీబీ హైస్పీడ్ డేటా 28 రోజుల పాటు లభిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. ఇది ప్లాన్ ద్వారా వచ్చే డేటా ఉపయోగించిన తర్వాత 5జీ నెట్‌వర్క్ ఏరియాల్లో ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది.
ఇటీవలే రిలయన్స్ జియో రూ.200 మెగా కంటెంట్ యాడ్ ఆన్ ఓటీటీ పాస్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 15 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందిస్తూనే అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఇస్తోంది. అలాగే 30 జీబీ డేటా ఇస్తోంది. దీంతో పాటు వొడాఫోన్ ఐడీయా సైతం రూ.200 ప్లాన్ లాంచ్ చేసింది. 20 ఓటీటీలు, 30జీబీ డేటా, అపరిమిత 5జీ డేటా 28 రోజుల పాటు అందిస్తోంది. ఇప్పుడు ఎయిర్‌టెల్ సైతం వాటి సరసన చేరిపోయింది.
ఎయిర్‌టెల్ రూ.200 ప్లాన్ ప్రకారం.. 30 జీబీ డేటా కోటా పూర్తియిన తర్వాత 1 MB డేటాకు 50 పైసల చొప్పున ఛార్జీలు వసూలు చేస్తారు. ప్రీపెయిడ్ యూజర్లు తమ డేటా అలవెన్సులను పెంచుకునేందుకు, ఓటీటీ స్ట్రీమింగ్ ఆప్షన్స్ పొడిగించుకునేందుకు ఈ యాడ్ ఆన్ ప్లాన్ ఒక సప్లిమెంటరీ రీఛార్జ్‌గా పని చేయనుంది. ఎయిర్‌టెల్ డిజిటల్ ప్లాట్ ఫారమ్స్‌లో ఈ రూ.200 ప్లాన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారానూ రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే, ఈ ప్లాన్ ఉపయోగించుకోవాలంటే యాక్టివ్ బేస్ ప్లాన్ కలిగి ఉండాలని యూజర్లు గుర్తుపెట్టుకోవాలి.

