Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా రోడ్డు ప్రమాదంలో గర్భిణీ అయిన టీనేజర్ ప్రియురాలు మృతి.. 33 ఏళ్ల భారతీయుడి అరెస్ట్

అమెరికా రోడ్డు ప్రమాదంలో గర్భిణీ అయిన టీనేజర్ ప్రియురాలు మృతి.. 33 ఏళ్ల భారతీయుడి అరెస్ట్

Telugu Samayam 1 day ago

US Crash Tarsem Singh Charged: అమెరికాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఒక లగ్జరీ కారు మితిమీరిన వేగంతో దూసుకెళ్లి ప్రమాదానికి గురైన ఘటనలో 17 ఏళ్ల గర్భిణీ టీనేజర్, ఆమె గర్భంలోని శిశువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదానికి కారణమైన, కారును నడిపిన మృతురాలి భర్త, 33 ఏళ్ల భారతీయ పౌరుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. కాగా నిందితుడు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నాడని తెలుసుకున్న బాధితురాలి కుటుంబం.. అతడిని దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేస్తోంది.

హైస్పీడ్ ఛేజ్.. గాల్లో ఎగిరిపడ్డ టీనేజర్

పోలీసు,హైవే పెట్రోల్ నివేదికల ప్రకారం.. ఫిబ్రవరి 16వ తేదీన ఈ ఘోర ప్రమాదం జరిగింది. భారత దేశం నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లి జీవిస్తున్న 33 ఏళ్ల తర్సేమ్ సింగ్.. తన రేంజ్ రోవర్ వేలార్ కారులో 17 ఏళ్ల అష్లీ హోమ్స్‌తో కలిసి ప్రయాణిస్తున్నాడు. గంటకు 55 మైళ్ల వేగ పరిమితి ఉన్న జోన్లో అతడు 79 మైళ్ల వేగంతో వెళ్తుండటాన్ని గమనించిన పోలీసులు కారును ఆపాల్సిందిగా కోరారు. అయితే పోలీసులకు దొరకకూడదనే ఉద్దేశంతో తర్సేమ్ సింగ్ కారు వేగాన్ని ఏకంగా 120 మైళ్లకు పెంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే కారు అదుపుతప్పి, ఒక మలుపు వద్ద రోడ్డు అవతలి వైపునకు దూసుకెళ్లి ఒక జీపును బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి రేంజ్ రోవర్ కారు గాల్లో పలుమార్లు పల్టీలు కొట్టింది. ఈ భయానక ప్రమాదంలో కారులో ఉన్న అష్లీ హోమ్స్ వాహనం నుంచి బయటకు ఎగిరిపడి తీవ్ర గాయాలతో మరణించింది. ఆమెతో పాటు గర్భంలో ఉన్న శిశువు కూడా ప్రాణాలు కోల్పోయింది.


నిందితుడు తర్సేమ్ సింగ్.. మరణించిన అష్లీ హోమ్స్ గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఆమె గర్భంలోని బిడ్డకు అతడే తండ్రి అని బాధితురాలి కుటుంబ సభ్యులు న్యూస్‌వీక్ పత్రికకు వెల్లడించారు. అష్లీ పలుమార్లు ఆ బంధం నుంచి బయటకు రావాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదని వారు వాపోయారు. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అందించిన సమాచారం ప్రకారం.. తర్సేమ్ సింగ్ 2017 ఫిబ్రవరిలో కాలిఫోర్నియా దక్షిణ సరిహద్దు ద్వారా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించాడు. అప్పట్లో అతడిని అరెస్ట్ చేసినప్పటికీ.. కోర్టు ఆదేశాల ప్రకారం బెయిల్‌పై విడుదల అయ్యాడు. అప్పటి నుంచి అతడు అమెరికాలో అక్రమ వలసదారుడిగానే జీవిస్తున్నాడు.

ఇదీ చూడండి: అమెరికాలో భారత సంతతి మిలియనీర్ అరెస్ట్.. వైన్ తయారీ కేంద్రాన్ని తగులబెట్టేందుకు యత్నించడమే కారణం

ఇమ్మిగ్రేషన్ అధికారులకు బాధితురాలి విజ్ఞప్తి..

ఈ ఉదంతంపై అష్లీ హోమ్స్ తల్లి అన్నెట్ హోమ్స్ (40) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "బిడ్డకు జన్మనివ్వబోతున్న ఏ ఆడపిల్లకూ ఇలాంటి మరణం రాకూడదు. అతడు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడని మాకు ఆలస్యంగా తెలిసింది. మా దేశంలో అతడు ఉండటానికి వీళ్లేదు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు అతడిని ఇక్కడి నుంచి శాశ్వతంగా తరిమేయాలి" అని ఆమె డిమాండ్ చేశారు.


ఇదీ చూడండి: అమెరికాలో భారత సంతతి దంపతుల అరెస్ట్.. మోటల్ మాటున ఆ పనులు చేయడం వల్లే..!

ప్రస్తుతం తర్సేమ్ సింగ్‌పై నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా మరణానికి కారణం కావడం, వెహిక్యులర్ హోమిసైడ్ వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. కోర్టు అతనికి ఒక మిలియన్ డాలర్ల భారీ బెయిల్ మొత్తాన్ని విధించింది. ఐసిఈ అధికారులు ఇప్పటికే అతనికి వ్యతిరేకంగా డిటైనర్ జారీ చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న తర్సేమ్‌కు ఆగస్టు 17 నుంచి 21వ తేదీ వరకు కోర్టు విచారణ జరగనుంది. క్రిమినల్ కేసు ముగిసిన వెంటనే అతడిని దేశం నుండి బహిష్కరించే ప్రక్రియ ప్రారంభం కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam