Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంతర్జాతీయ కెరీర్‌కు మెస్సీ టాటా..  భావోద్వేగ ప్రకటన..!

అంతర్జాతీయ కెరీర్‌కు మెస్సీ టాటా.. భావోద్వేగ ప్రకటన..!

Telugu Samayam 1 week ago

ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే గొప్ప అధ్యాయం ముగిసింది. మేటి ఆటగాడిగా పేరు సంపాదించిన లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

ఇకపై తాను అర్జెంటీనా జట్టు తరఫున ఆడబోనని ప్రకటించాడు. మెస్సీ అర్జెంటీనా తరఫున 2006లో అరంగేట్రం చేశాడు. 2022లో తొలిసారి ఫిఫా ప్రపంచకప్ అందుకున్నాడు. 20 ఏళ్ల పాటు తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు అతడు కృతజ్ఞతలు తెలిపాడు.

"ఇది తీవ్రమైన బాధను కలిగించే నిర్ణయం. కానీ ప్రతి అధ్యాయానికి ముగింపు ఉంటుంది. దేశం కోసం ఆడటానికి నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేశా. మీకు ఆనందాన్నివ్వడం, అర్జెంటీనా పౌరులుగా మీరు గర్వపడేలా చేయడం కోసమే ఇదంతా చేశా. ఇక ఇచ్చేందుకు ఏమీ లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చే యువ ఆటగాళ్లకు అవకాశాలు దక్కాలి" అని మెస్సీ తన రిటైర్మెంట్ పోస్టులో 39 ఏళ్ల మెస్సీ పేర్కొన్నాడు.


హంగేరీపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే రెడ్ కార్డ్‌ ఎదుర్కొని మైదానాన్ని వీడిన మెస్సీ, ఆ తర్వాత అర్జెంటీనా ఫుట్‌బాల్ చరిత్రను తిరగరాశాడు. దిగ్గజ ఆటగాడు డియాగో మారడోనా కంటే రెట్టింపు మ్యాచ్‌లు ఆడి, 207 మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో ఏకంగా 125 గోల్స్ కొట్టాడు. నిజానికి 2016లోనే మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. కానీ అభిమానుల కోరిక మేరకు మళ్లీ వచ్చి, అర్జెంటీనాకు ఎన్నో మరపురాని విజయాలు అందించారు. మైదానంలో మెస్సీ వేసే మెరుపు అడుగులు, గోల్స్ సాధించే నైపుణ్యం కోట్లాది మంది అభిమానులను అలరించాయి.


మెస్సీ తన కెరీర్‌లో తొలి గోల్‌ను 2006లో క్రొయేషియాపై కొట్టాడు. ఇక చివరి గోల్ ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో సాధించాడు. ఈజిప్ట్‌తో మ్యాచులో అతడు లాస్ట్ గోల్ కొట్టాడు. అయితే అర్జెంటీనాకు వీడ్కోలు పలికినప్పటికీ మెస్సీ మాత్రం క్లబ్ ఫుట్‌బాల్ మాత్రం ఆడనున్నాడు. అతడు ప్రస్తుతం మేజర్ లీగ్ సాకర్ క్లబ్ ఇంటర్ మయామి కెప్టెన్‌గా ఉన్నాడు. మొత్తంగా తన కెరీర్‌లో ఆరు ప్రపంచకప్‌లు ఆడిన మెస్సీ.. ఏకంగా 21 గోల్స్ కొట్టాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam