Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అప్పట్లో భయపెట్టి, ఇప్పుడు కడుపుబ్బా నవ్వించి.. 26 ఏళ్ల క్రితమే తెలుగులో 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్' నటుడు

అప్పట్లో భయపెట్టి, ఇప్పుడు కడుపుబ్బా నవ్వించి.. 26 ఏళ్ల క్రితమే తెలుగులో 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్' నటుడు

Telugu Samayam 1 month ago

మలయాళంలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రికార్డ్ క్రియేట్ చేసిన సినిమా 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్'. 'ప్రేమమ్' ఫేమ్ నివిన్ పౌలీ, 'ప్రేమలు' బ్యూటీ మమిత బైజు జంటగా నటించిన చిత్రమిది.

థియేటర్లలో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన ఈ మూవీకి ఓటీటీలోనూ అనూహ్య స్పందన లభిస్తోంది. తెలుగు ఆడియన్స్ కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. నటీనటుల ఫర్మార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అందులో హీరో హీరోయిన్లతో పాటుగా సురేష్ కృష్ణ పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది.

'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్' సినిమాలో జస్టిన్ (నివిన్ పౌలీ) ఫ్రెండ్ బైజు జీవియర్ పాత్రలో మలయాళ నటుడు సురేష్ కృష్ణ నటించారు. పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేసే పాత్ర అది. హీరోతో పాటుగా ఉంటూ అన్ని విషయాల్లోనూ సపోర్టుగా నిలుస్తుంటాడు. ఇందులో ఆయన పండించిన హాస్యం ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమాలో కాలేజీ స్టూడెంట్స్ తో ఫైట్ చేసే సన్నివేశంలో, 'తుడురుమ్' మూవీలో మోహన్ లాల్ స్టైల్ లో జంప్ చేసే షాట్ కి థియేటర్లో విజిల్స్ పడ్డాయి. అయితే ఇప్పుడు 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్'లో తన కామెడీతో నవ్వించిన సురేష్ కృష్ణ.. రెండున్నర దశాబ్దాల క్రితం తన లుక్ తోనే అందర్నీ భయపెట్టారనే సంగతి చాలామందికి తెలియకపోవచ్చు.

2000లో రోజా, వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో 'దుర్గ' అనే సినిమా (తమిళంలో 'పొట్టు అమ్మన్') వచ్చింది. ఇది రోజా 100వ చిత్రంగా ప్రచారం చేయబడింది. తెలుగులో ఆర్.కె. సెల్వమణి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో మాంత్రికుడిగా నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్రలో సురేష్ కృష్ణ నటించారు. ఈ సినిమాలో ఆయన లుక్, గెటప్ చూస్తే పిల్లలు భయపడేవారు. ఆయన కనిపించే సురేష్ ఇప్పుడు 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్' సినిమాలో కామెడీ పండించడంతో, నెటిజన్లు 'దుర్గ'లో ఆయన పాత్రను గుర్తు చేస్తున్నారు. రెండు ఫోటోలను పక్కపక్కనే పెట్టి ఎడిట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు.


సురేష్ కృష్ణ సైతం ఆ ఇద్దరూ నేనే అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ''మిత్రులారా, ఆ ఇద్దరూ నేనే... ఏమాత్రం సందేహించకండి.. 2000లో 'పొట్టు అమ్మన్', 2026లో 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్'' అని పేర్కొన్నారు. రెండు పాత్రల్లో వేరియేషన్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన 'మరణమాస్', 'రైఫిల్ క్లబ్', 'నడికర్', 'మరక్కార్', 'వన్' వంటి చిత్రాల్లోనూ సురేష్ కృష్ణ కీలక పాత్రలు పోషించారు.


'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్' చిత్రానికి గిరీష్ ఎ.డి దర్శకత్వం వహించగా.. ఫహద్ ఫాజిల్ నిర్మించారు. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ.330 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓనం స్పెషల్ గా ఆగస్టు 21న మలయాళంలో విడుదలైన ఈ సినిమాని సెప్టెంబర్ 4న మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగులో రిలీజ్ చేసింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్‌ వేదికగా మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam