Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అసలు ఇదేం పోజ్ అన్నా.. టిమ్ డేవిడ్ - ఫిల్ సాల్ట్ సెలబ్రేషన్స్ అరాచకం!

అసలు ఇదేం పోజ్ అన్నా.. టిమ్ డేవిడ్ - ఫిల్ సాల్ట్ సెలబ్రేషన్స్ అరాచకం!

Telugu Samayam 1 week ago

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీలోనే ఓ వైబ్ ఉంటుంది. ఆ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసే ఆటగాళ్లు కూడా అంతే వైబ్‌లో ఉంటారు. ఐపీఎల్ 2025 మెగా వేలం తర్వాత ఆర్సీబీ ప్లేయర్లను చూస్తే అది నిజమే అనిపిస్తుంది.

ముఖ్యంగా ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ ఎప్పుడూ హైలెట్‌గా నిలుస్తారు. మ్యాచ్‌లో అయినా, ప్రాక్టీస్ సెషన్‌లో అయినా.. డ్రెస్సింగ్ రూమ్‌లో అయినా ఈ ముగ్గురు ఎప్పుడూ ఫుల్ వైబ్‌లో కొనసాగుతారు.

ఐపీఎల్ 2026 ఫైనల్స్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించిన తర్వాత ఆర్సీబీ ప్లేయర్లు సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఐపీఎల్ 2025లో తొలిసారి టైటిల్ అందుకున్న ఆర్సీబీ.. ఈ ఏడాది కూడా వరుసగా రెండో సారి ట్రోఫీ సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లి విన్నింగ్స్ సిక్సర్ బాదినప్పటి నుంచి ఆర్సీబీ సెలబ్రేషన్స్ ఆగలేదు. కోహ్లితో సహా మిగతా ప్లేయర్లంతా గ్రౌండ్‌లో సెలబ్రేషన్స్ మోత మోగించారు.

ముఖ్యంగా ఫిల్ సాల్ట్ - టిమ్ డేవిడ్ సెలబ్రేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ పెద్ద ఐస్ బాక్స్ తీసుకుని వచ్చి మరీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌పై గుమ్మరించారు. టైటిల్ అందుకున్న తర్వాత కృనాల్ పాండ్యాతో కలిసి టిమ్ డేవిడ్ రెండు వేళ్లు చూయిస్తూ.. తమకు రెండు టైటిల్స్ వచ్చాయంటూ రచ్చ చేశారు. ఫిల్ సాల్ట్, రొమారియో షెఫర్డ్ ఇలా మిగతా ఆటగాళ్లంతా ఫుల్ వైబ్‌లో మునిగిపోయారు.

అయితే, ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓ ఫొటో మాత్రం అందర్నీ ఆకట్టుకుంది. ఆ ఫొటోలో టిమ్ డేవిడ్ తన భుజాలపై ఫిల్ సాల్ట్‌ను ఎత్తుకుని ఉండగా.. ఫిల్ సాల్ట్ తన రెండు చేతులతో ఐపీఎల్ ట్రోఫీ పట్టుకున్నాడు. కింద ఉన్న టిమ్ డేవిడ్ తన తలపై ఆ కప్ మూత పెట్టేసుకుని చీర్స్ కొడుతూ కనిపించారు. అసలు ఈ సెలబ్రేషన్స్ చూసి ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్ల మతి కూడా పోయింది. అసలు ఇదేం సెలబ్రేషన్స్ అన్నా అంటూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు.

ఆర్సీబీ విజయాల్లో టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్ పాత్ర చాలా కీలకం. 2025 మెగా వేలంతో ఆర్సీబీ ఎంట్రీ ఇచ్చిన ఈ ఇద్దరూ రెచ్చిపోయి ఆడారు. ఐపీఎల్ 2025లో టిమ్ డేవిడ్ అరాచక ఇన్నింగ్స్‌లు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లలో ఆర్సీబీ విజయాల్లో ఫిల్ సాల్ట్ పాత్ర చాలా కీలకం. ఓపెనర్‌గా వచ్చి విధ్వంసాలు సృష్టించారు. మొత్తానికి ఆర్సీబీ వరుసగా రెండు టైటిల్స్ గెలిచి ఓ చరిత్ర సృష్టించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam