Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
August 2026 Festivals: శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం, రాఖీ పూర్ణిమతో పాటు వచ్చే ముఖ్య పండుగలివే

August 2026 Festivals: శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం, రాఖీ పూర్ణిమతో పాటు వచ్చే ముఖ్య పండుగలివే

Telugu Samayam 1 month ago

August 2026 Festivals : హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసం పరమేశ్వరునికి ప్రీతికరమైనది. ఇదే మాసంలో వరలక్ష్మీ వ్రతం, రాఖీ పూర్ణిమతో పాటు ఎన్నో ముఖ్యమైన పండుగలు, వ్రతాలు రానున్నాయి.

ఈ సందర్భంగా ఆగస్టు మాసంలో ఏయే పండుగలు ఎప్పుడొచ్చాయి. ఏయే రోజుల్లో వ్రతాలు చేయడానికి శుభ ముహుర్తాలున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


August 2026 Festivals : తెలుగు పంచాంగం ప్రకారం, మరికొన్ని రోజుల్లో ఆషాఢ మాసం పూర్తవుతుంది. తెలుగు నెలల్లో ఐదో నెల అయిన శ్రావణ మాసం ఆగస్టు 13వ తేదీ గురువారం నుంచి ప్రారంభమవుతుంది. హిందూ మతంలో శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసం పరమేశ్వరునికి ప్రీతికరమైనది. ఇదే మాసంలో వరలక్ష్మీ వ్రతం, రాఖీ పూర్ణిమ, నాగపంచమి, కామికా ఏకాదశి, సంకటహర చతుర్థి వంటి ఎన్నో పండుగలు, వ్రతాలు రానున్నాయి. ఈ సందర్భంగా శ్రావణ మాసంలో ఏయే పండుగలు ఎప్పుడొచ్చాయి. ఏయే రోజుల్లో వ్రతాలు చేయడానికి శుభ ముహుర్తాలున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.శ్రావణ సోమవారాలు

ఈ నెలలో వచ్చే శ్రావణ సోమవారాలను చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. సోమవారం భోళా శంకరునికి అంకితం ఇవ్వబడింది. అందుకే ఈరోజున శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తారు. మహా శివరాత్రి పండుగ తర్వాత ఈశ్వరునికి ఈ నెలలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు.


నాగ పంచమి ఎప్పుడంటే

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పంచమి రోజున నాగ పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 17వ తేదీన ఈ పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున పుట్ట దగ్గరికి వెళ్లి నాగదేవతలకు పాలు నైవేద్యంగా ఇస్తారు. ఇలా చేయడం నాగ దేవత అనుగ్రహం లభిస్తుందచి చాలా మంది నమ్ముతారు. ఇదే రోజున కల్కి జయంతి కూడా జరుపుకుంటారు. అదే విధంగా శ్రావణ మంగళవారం రోజున గౌరీ వ్రతం కూడా నిర్వహిస్తారు.


వరలక్ష్మీ వ్రతం

దక్షిణ భారతంలో శ్రావణ మాసంలో పాటించే అత్యంత ప్రధానమైన పండుగల్లో వరలక్ష్మీ వ్రతం ఒకటి. ఈ పండుగ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 21వ తేదీన సకల ఐశ్వర్యాలు, సౌభాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారిని అలంకరించి, భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటుందని, తమ కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు.


రాఖీ పౌర్ణమి

శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమను శ్రావణ పూర్ణిమ అంటారు. ఇదే రోజున ప్రపంచ వ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున సోదరీమణులంతా తమ సోదరులకు రాఖీ కట్టి వారి శ్రేయస్సును కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 28వ తేదీన రాఖీ పండుగను జరుపుకోనున్నారు. ఇదే రోజున గాయత్రి మాత జయంతి వేడుకలను కూడా నిర్వహిస్తారు. హయగ్రీవ జయంతి వేడుకలను ఇదే రోజున జరుపుకోనున్నారు.


ముఖ్యమైన తేదీలు

ఆగస్టు 2, 31వ తేదీలలో - సంకటహర చతుర్థి
ఆగస్టు 9న - కామికా ఏకాదశి
ఆగస్టు 10న - ప్రదోష వ్రతం
ఆగస్టు 11న - మాస శివరాత్రి
ఆగస్టు 22న -తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం
ఆగస్టు 26న - తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల ముగింపు, ఓనం పండుగ
ఆగస్టు 30న - పుబ్బ కార్తె

ఈ పండుగలతో పాటు శ్రావణమాసంలో ఉపవాస దీక్షలు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ మాసంలో చేసే ప్రతి వ్రతం, పండుగకు ఆధ్యాత్మిక విశిష్టత ఉందని పండితులు చెబుతారు.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Read Latest Astrology News and Telugu News


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam