Dailyhunt
అవును నా ఇల్లు రూ.కోటి పైనే.. నా కారు విలువ రూ.56 లక్షలు.. లెక్కలతో మహాసేన రాజేష్ వీడియో

అవును నా ఇల్లు రూ.కోటి పైనే.. నా కారు విలువ రూ.56 లక్షలు.. లెక్కలతో మహాసేన రాజేష్ వీడియో

Telugu Samayam 3 days ago

హాసేన రాజేష్.. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. యూట్యూబర్‌గా ప్రస్థానం ప్రారంభించి.. రాజకీయాల వైపు నడిచారు. 2024 ఎన్నికల్లో ఏకంగా ఎమ్మెల్యే టికెట్ దక్కినా చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు..

ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతూ మహాసేన వీడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా మహసేన రాజేష్ కాకినాడ జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. గతంలో అద్దె ఇంట్లో ఉన్న వ్యక్తికి టీడీపీ అధికారంలోకి రాగానే ఏకంగా రూ.3 నుంచి రూ.4 కోట్లు పెట్టి ఇల్లు ఎలా నిర్మిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నించారు. ఆయన రూ.50 లక్షలు పెట్టి కారు ఎలా కొనుగోలు చేశారంటూ పోస్టులు పెట్టారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత డబ్బు ఎలా వచ్చిందంటూ రాజేష్ నిర్మిస్తున్న ఇంటి వీడియోను పోస్ట్ చేశారు.


సోషల్ మీడియా వేదికగా వస్తున్న ట్రోల్స్‌పై మహాసేన రాజేష్ స్పందించారు.. యూట్యూబ్‌లో వీడియోను విడుదల చేశారు. తాను కట్టుకునే ఇంటి విలువ రూ.కోటి పైనే ఉంటుందని.. తన కారు రూ.50 లక్షలు కాదని.. తాను వాడే కారు Fortuner టాప్ మోడల్.. విలువ రూ.56 లక్షల ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇల్లు,కారు కోసం తాను అవినీతి, అక్రమాలు చేయాల్సిన పనిలేదన్నారు. 2021లో మహాసేన మీడియాను మొదలు పెట్టానని.. తన ప్రాణాలకు, కేసులకు భయపడకుండా గత ప్రభుత్వంలో మోసాలు, అక్రమాలను ప్రజలకు తెలియజేశానన్నారు. తాను యూట్యూల్‌లో మొత్తం 7200 వీడియోలు చేశానని.. వాటికి 53 కోట్ల వ్యూస్ వచ్చాయన్నారు. తనకు లక్ష వ్యూస్ వస్తే.. రూ.4వేలు యూట్యూబ్ నుంచి వస్తుందని వివరించారు రాజేష్ మహాసేన. అలా చూస్తే ప్రభుత్వానికి ట్యాక్స్ పోను తనకు రూ.2 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. తాను ఇంటి నిర్మాణం కోసం ఒమ్మంగి ICICI బ్యాంకులో రూ.45 లక్షల లోన్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. తన కారుకు సంబంధించి Bank Of Barodaలో లోన్ ఉందని.. ప్రతి నెలా తాను 43వేలు ఈఎంఐ కడుతున్నట్లు తెలిపారు. తన దగ్గర బ్యాంక్ స్టేట్‌మెంట్స్ సహా ఆధారాలన్నీ ఉన్నాయని.. ఎక్కడికి రమ్మన్నా వచ్చి వాటిని ఇస్తానన్నారు.

గతంలో తాను ఎన్నో ఉద్యోగాలు చేశానని.. 2017లో ట్రెండ్ సెట్టర్ అనే కంపెనీకి ఎండీగా పనిచేశానని.. యూనిట్ విలువు రూ.50 లక్షలు ఉండేదని, 50మంది పనిచేసేవారన్నారు. తన పూర్వీకుల కాలంలో 12 ఎకరాల పొలం ఉండేదని.. తన అమ్మమ్మ, తాతయ్యలు హెడ్‌మాస్టర్‌లుగా ఉద్యోగం చేశారన్నారు. తన అత్తమామలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారన్నారు. తాను ట్రెండ్ సెట్టర్ కంపెనీ విషయంలో కొందరు తనను టార్గెట్ చేశారని.. 2018, 2019లో చాలా ఇబ్బందులుపడ్డానన్నారు. ఆ తర్వాత మహాసేన ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలపై పోరాటం చేశానన్నారు. 2021లో మహాసేన మీడియా పేరుతో స్టూడియోను ప్రారంభించానన్నారు. అప్పటి నుంచి వీడియోలు చేసి.. తద్వారా ఆదాయం వచ్చిందన్నారు.


కాకినాడ జిల్లాకు చెందిన సరిపెళ్ల రాజేష్‌ మహాసేన పేరుతో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. 2019 ఎన్నికల సమయంలో
వైఎస్సార్‌సీపీకి మద్దతు ప్రకటించారు.. ఆ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత కొంతకాలనికి వైఎస్సార్‌సీపీ నుంచి దూరమైన రాజేష్.. ఆ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు, యూట్యూబ్ వీడియోలతో విమర్శలు చేశారు. ఆ సమయంలో రాజేష్‌పై కేసులు కూడా నమోదయ్యాయి. 2023లో మహాసేన రాజేష్ జనసేన పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అనూహ్య పరిణామాల మధ్య టీడీపీలో చేరగా.. రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారు. 2024 ఎన్నికల్లో రాజేష్‌కు టీడీపీ అధిష్టానం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం సీటు ప్రకటించింది. కానీ మహాసేన రాజేష్‌కు టికెట్ ఇవ్వడంపై హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. రాజేష్ గతంలో సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యల్ని తెరపైకి తీసుకొచ్చారు. అలాగే పి గన్నవరం నియోజకవర్గంలో కూడా రాజేష్‌కు టికెట్ ఇవ్వడంపై కూటమి పార్టీల్లో కూడా నిరసన వ్యక్తమైంది. ఈ పరిణామాలతో ఆయన తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజేష్ టీడీపీలో గతవారం వరకు అధికార ప్రతినిధి కొనసాగారు.. ఇటీవల టీడీపీ కొత్త కార్యవర్గాన్ని నియమించగా రాజేష్‌కు ఎలాంటి పదవి దక్కలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam