Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాక్సాఫీస్ బరిలో 'లెనిన్'.... అఖిల్, భాగ్యశ్రీ, నాగవంశీలకు అసలైన అగ్నిపరీక్ష

బాక్సాఫీస్ బరిలో 'లెనిన్'.... అఖిల్, భాగ్యశ్రీ, నాగవంశీలకు అసలైన అగ్నిపరీక్ష

Telugu Samayam 1 week ago

టాలీవుడ్‌లో ఒక సినిమా విజయం అనేది కేవలం కలెక్షన్లకు మాత్రమే పరిమితం కాదు.. కొన్నిసార్లు అది నటీనటుల, నిర్మాతల భవిష్యత్తును సైతం శాసిస్తుంది. ప్రస్తుతం అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'లెనిన్' సరిగ్గా ఇలాంటి స్థితిలోనే నిలిచింది.

మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ రొమాంటిక్ డ్రామా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమా కేవలం అక్కినేని అభిమానుల అంచనాలే కాదు.. ఇటు హీరో అఖిల్, అటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, మరోవైపు ట్రేడ్ వర్గాల్లో తిరుగులేని క్రేజ్ ఉన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీలకు ఒక రియల్ ఫైర్ టెస్ట్‌గా మారింది.

* మూడు రాచ కుటుంబాలకు వారసురాలు, స్టార్ హీరోయిన్.. ఒక్క వీడియోతో జీవితం తల్లకిందులు

అఖిల్ 'రీ-ఎంట్రీ' సెటైర్లకు బ్రేక్ పడేనా?
అక్కినేని అఖిల్‌కు బాక్సాఫీస్ వద్ద ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం ఇప్పుడు అత్యంత అనివార్యంగా మారింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఆయన ప్రతి సినిమాకు వినిపించే రీ.. ఎంట్రీ లాంటి ట్రోల్స్, సెటైర్లకు చెక్ పెట్టాలంటే ఈ 'లెనిన్' చిత్రం భారీ విజయం సాధించాల్సిందే. అక్కినేని అభిమానులు థియేటర్ల వద్ద కాలర్ ఎగరేసి పండగ చేసుకోవాలన్నా అఖిల్ ఈసారి ఖచ్చితంగా హిట్ ట్రాక్ ఎక్కాలి. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో 'లెనిన్' అనే పవర్‌ఫుల్ పాత్రలో అఖిల్ చూపించబోయే మాస్ మేకోవర్, యాక్షన్ ఎలిమెంట్స్ ఆయన కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తాయని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.


భాగ్యశ్రీకి సాలిడ్ హిట్ దక్కేనా?
టాలీవుడ్ ఎంట్రీ తర్వాత భాగ్యశ్రీ బోర్సే లైనప్స్ బాగానే ఉన్నప్పటికీ, ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఇండస్ట్రీలో ఆమెపై ఐరన్ లెగ్ ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, ఫ్లాపులు పడుతున్నా ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఒకవేళ ఈ ఫ్లాప్ స్ట్రీక్‌లో ఉండి కూడా భాగ్యశ్రీ 'లెనిన్' సినిమాతో ఒక్క సాలిడ్ హిట్ కొట్టిందా.. ఇక ఆమె రేంజ్, డిమాండ్ ఊహించని స్థాయికి చేరుకోవడం ఖాయం. అందుకోసం ఈ చిత్రంలో 'భారతి'గా ఆమె చేసిన నటన, అఖిల్‌తో పండించిన కెమిస్ట్రీ థియేటర్లలో క్లిక్ అవ్వడం చాలా కీలకం.

* రోడ్డు మీద సిగరెట్ పీకలు ఏరుకుని తాగేవాడు - ఆకలి, అవమానాలే ఆయన్ని సూపర్‌స్టార్‌ని చేశాయ్

నాగవంశీకి అసలైన సవాల్
నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ఈ సినిమా ఒక సవాల్‌తో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఇటీవల సంక్రాంతి బరిలో వచ్చిన 'అనగనగా ఒక రాజు' చిత్రం కొంతవరకు ఊరటనిచ్చినప్పటికీ.. దానికి ముందు కింగ్‌డమ్, వార్ 2 చిత్రాలతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థకు పెద్ద షాకులే తగిలాయి. ప్రస్తుతం అఖిల్ లాంటి యంగ్ హీరో కెరీర్‌ను మళ్లీ పక్కాగా ట్రాక్‌లో పెట్టే భారీ బాధ్యతను నాగవంశీ తన భుజాలపై వేసుకున్నారు. అందుకే ఎక్కడా బడ్జెట్ విషయంలో వెనకాడకుండా, అవసరమైన చోట రీ-షూట్‌లు కూడా జరుపుతూ, అన్ని రకాల జాగ్రత్తలతో ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జునతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేస్తే, ఆ క్రెడిట్‌లో మెజారిటీ భాగం నాగవంశీ ప్లానింగ్‌కే దక్కుతుంది.

కురుక్షేత్రాన్ని తలపించే కథాంశం
రాయలసీమ పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో లెనిన్, భారతిల మధ్య చిగురించిన ప్యూర్ లవ్ స్టోరీ.. వారి కుటుంబాల మధ్య, రాజకీయాల మధ్య జరిగే ఒక పెద్ద కురుక్షేత్రంగా ఎలా మారింది? ప్రేమ కోసం హీరో చేసే యాక్షన్ యుద్ధం ఏంటి? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ చిత్రంలో సునీల్, శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావు వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, స్టార్ కంపోజర్ తమన్ అందిస్తున్న మ్యూజిక్ సినిమాకు మేజర్ అసెట్ కానుంది. మరి ముగ్గురు ప్రధాన పిల్లర్లకు అగ్నిపరీక్షగా మారిన ఈ 'లెనిన్' జూలై 10న బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam