మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వచ్చిన 38వ చిత్రం 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day) బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది.
దాదాపు 225 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,100 కోట్లు) భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1 బిలియన్ డాలర్ల వసూళ్ల మైలురాయిని అధిగమించి బాక్సాఫీస్ షేకర్ అనిపించుకుంది.
* హైదరాబాద్ ఐటీ హబ్‌లో మరో చార్మినార్.. ప్రభాస్ 'ఫౌజీ' కోసం మేకర్స్ బిగ్ ప్లాన్
సెకండ్ హయ్యస్ట్ ఓపెనర్
విడుదలైన మొదటి వీకెండ్‌లోనే తన నిర్మాణ బడ్జెట్‌ను అధిగమించిన ఈ సినిమా, హాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచ సినిమా చరిత్రలోనే 'అవెంజర్స్: ది ఎండ్‌గేమ్' ($1.2 బిలియన్లు) తర్వాత అత్యంత భారీ గ్లోబల్ ఓపెనింగ్ ( $1 బిలియన్ ) సాధించిన రెండో అతిపెద్ద చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. లాంగ్ రన్‌లో ఈ సినిమా 2 బిలియన్ డాలర్ల మార్కును కూడా సునాయాసంగా అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో డిసెంబర్‌లో రానున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే' కంటే ముందే మార్వెల్ స్టూడియోస్‌కు ఈ విజయం కొండంత ఊపునిచ్చింది. భారతదేశంలోనూ ఈ స్పైడీ మానియా గట్టిగా నడుస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఇండియాలో ఇప్పటికే ఈ సినిమా వసూళ్లు రూ. 400 కోట్ల దాకా చేరుకుని కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తోంది.
* బాలయ్య గాయపడటంతో ప్లాన్ మొత్తం మార్చేసిన కొరటాల... షూటింగ్ ఎప్పటి నుంచంటే
గ్లోబల్‌గా ఆగస్టు 7 నుండి కొన్ని ప్రధాన ప్రాంతాల్లో ఐమాక్స్ స్క్రీన్లను విస్తరిస్తున్నప్పటికీ, భారత్‌లోని ప్రేక్షకులకు మాత్రం 'స్పైడర్ మ్యాన్' ఐమాక్స్ అనుభవం లభించడం లేదు. లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' (The Odyssey) చిత్రం దేశంలోని అన్ని ఐమాక్స్ స్క్రీన్లను ముందే అగ్రిమెంట్‌తో లాక్ చేసుకోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ ఒప్పందం మరియు ఉన్న భారీ డిమాండ్ కారణంగా భారతదేశంలో 'స్పైడర్ - మ్యాన్: బ్రాండ్ న్యూ డే' చిత్రానికి ఐమాక్స్ స్క్రీన్లు లభించడం లేదని సోనీ పిక్చర్స్ ఇండియా అధికారికంగా వెల్లడించింది. ఏదేమైనా, సాధారణ స్క్రీన్లపై కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో స్పైడర్ మ్యాన్ సరికొత్త కలెక్షన్ రికార్డులతో దూసుకుపోతోంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

