Dailyhunt
Bank Holidays: 12 రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఏప్రిల్ సెలవుల లిస్ట్ ఇదే.. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ రోజు మూతపడతాయంటే?

Bank Holidays: 12 రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఏప్రిల్ సెలవుల లిస్ట్ ఇదే.. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ రోజు మూతపడతాయంటే?

Telugu Samayam 1 week ago

Bank Holidays: ఏప్రిల్ నెలలో ఏదైనా ఆర్థిక పరమైన పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లే వారికి బిగ్ అలర్ట్. ఏప్రిల్ నెలలో సెలవుల గురించి ముందుగా తెలుసుకోవడం చాలా అవసరం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన హాలీడేస్ జాబితా ప్రకారం ఏప్రిల్ 2026లో దేశవ్యాప్తంగా బ్యాంకులు 12 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. వివిధ రాష్ట్రాల్లో పండగలు, జాతీయ పండగలు, జయంతి వేడుకలు, వారాంతపు సెలవులతో బ్యాంకులకు భారీగా సెలవులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీగానే సెలవులు ఉన్నాయి. వినియోగదారులు తమ బ్యాంకు పనులు ముందస్తు ప్రణాళిక ప్రకారం పూర్తి చేసుకోవడం మంచిది. మరి ఆ సెలవుల గురించి తెలుసుకుందాం.

  • ఏప్రిల్ 1 బుధవారం రోజు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా అకౌంట్స్ యాన్యువల్ క్లోజింగ్ ఉంటుంది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • ఏప్రిల్ 2 గురువారం రోజు మౌండీ థర్స్ డే సందర్భంగా కేరళంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • ఏప్రిల్ 3 శుక్రవారం రోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
  • ఏప్రిల్ 5 ఆదివారం రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
  • ఏప్రిల్ 11 రెండో శనివారం సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
  • ఏప్రిల్ 12 ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
  • ఏప్రిల్ 14 మంగళవారం రోజు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • ఏప్రిల్ 15 బుధవారం రోజు బెంగాలీ నూతన సంవత్సరం, బొహగ్ బిహు హిమాచల్ డే సందర్భంగా కోల్‌కతా, గువాహటి, సిమ్లా వంటి ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • ఏప్రిల్ 19 ఆదివారం రోజున బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
  • ఏప్రిల్ 20 సోమవారం రోజు అక్షయ తృతీయ, బసవ జయంతి ఉన్న సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • ఏప్రిల్ 25 నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • ఏప్రిల్ 26 ఆదివారం సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.


మార్చి చివరి రెండు రోజులు ( మార్చి 30, మార్చి 31) సహా ఏప్రిల్ తొలి 5 రోజులలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులకు వరుసగా సెలవులు ఉన్నాయి. మహవీర్ జయంతి సందర్భంగా మార్చి 31వ తేదీన బ్యాంకులు పనిచేయవు. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల తేదీల్లో స్థానిక బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే, బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ వినియోగదారులు ఏటీఎంలు, యూపీఐ, ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు పొందవచ్చు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam