Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెస్పాన్స్ దద్దరిల్లింది.. గెట్ రెడీ అంటోన్న నాగార్జున

బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెస్పాన్స్ దద్దరిల్లింది.. గెట్ రెడీ అంటోన్న నాగార్జున

Telugu Samayam 2 days ago

బిగ్ బాస్ 10 త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఆగస్ట్ ఎండింగ్ లేదా సెప్టెంబర్ ప్రారంభంలో ఈ పదో సీజన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గత సీజన్‌లో అగ్ని పరీక్షను పెట్టి..

సామాన్యుల పేరిట కొంత మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లను బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అలా కొన్ని వారాలు సామాన్యులు వర్సెస్ సెలెబ్రిటీలు అని షోని రన్ చేశారు. అలా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన అగ్ని పరీక్ష కంటెస్టెంట్లు దుమ్ములేపేశారు. చివరకు కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచాడు. అలా అగ్ని పరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్లు బాగానే పాపురల్ అయ్యారు.

ఇక ఈ పదో సీజన్‌కి బిగ్ బాస్ టీం రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే కొంత మంది సెలెబ్రిటీలను అప్రోచ్ అయినట్టుగా సమాచారం. అందులో చాలా మంది కంటెస్టెంట్ల పేర్లు ఇవే అంటూ సోషల్ మీడియాలో లీక్ అవుతున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా కుకు విత్ జాతిరత్నాలు టీం నుంచి చాలా మంది బిగ్ బాస్ ఇంట్లోకి వస్తారని అంటున్నారు. ఇక నిఖిల్ విజయేంద్ర సింహా, పల్లవి గౌడ, పల్లవి రాంశెట్టి, తేజస్విని గౌడ, హరి, దీపిక వంటి వారు బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉందని సమాచారం.


మరో వైపు అగ్నిపరీక్ష 2 సీజన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే రెండు, మూడు డెడ్ లైన్స్ ఇచ్చి అగ్నిపరీక్ష ఆడిషన్స్ వీడియోల్ని పంపమని బిగ్ బాస్ టీం చెప్పింది. బిగ్ బాస్ టీం ఇచ్చిన ప్రకటన, అగ్నిపరీక్ష ఆడిషన్ వీడియోలకు రెస్పాన్స్ అదిరిపోయిందని, ఈ సారి కసి పెరిగింది.. కథ మారింది అంటూ నాగార్జున ఈ ప్రోమోలో చెప్పాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది. గెట్ రెడీ ఫర్ బిగ్ బిఫోర్ బిగ్గెస్ట్ అని చెప్పుకొచ్చారు. ఈ ప్రోమో వచ్చిందంటే.. త్వరలోనే అగ్ని పరీక్ష షో స్టార్ట్ కాబోతోందన్న మాట. అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన ఐదారు వారాలకి బిగ్ బాస్ పదో సీజన్ కూడా మొదలు అవుతుందన్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ షోకి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్ బాస్ షో మొదలైతే సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ అంటూ జరిగే రచ్చ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆర్మీలు అంటూ కంటెస్టెంట్ల తరుపున ఫ్యాన్స్, పెయిడ్ బ్యాచ్‌లు చేసే హంగామాతో సోషల్ మీడియా అంతా షేక్ అవుతుంటుంది. మరి ఈ పదో సీజన్‌లో ఎలాంటి కాంట్రవర్సీలు వస్తాయో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam