బిగ్ బాస్ ఇంట్లో 31వ రోజు.. 32వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం. నామినేషన్స్ ముగిసిన తర్వాత కంటెస్టెంట్లంతా కూడా అక్కడ వచ్చిన పాయింట్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.
షాలినీ అయితే కనీసం డ్యాగర్ల కోసం పోరాడింది.. ఝాన్సీ అయితే ఇమ్యూనిటీ వద్దు అని డ్యాగర్లను త్యాగం చేసిందని అగ్ని పరీక్ష టీంతో అపూర్వ చెబుతుంది. ఝాన్సీని పక్కన పెట్టుకునే రోహిత్, అమన్, చరణ్, అపూర్వ మాట్లాడుకుంటారు. ఈ పాయింట్లన్నీ మళ్లీ నామినేషన్లో పెడుతుంది.. ఈ మాటలన్నీ ఆ టీంకి చెబుతుందని రోహిత్, అమన్ అంటారు. అయితే నేను వెళ్లిపోతా మీరు మాట్లాడుకోండని ఝాన్సీ అంటుంది. నువ్వు ఇటు సైడ్ ఉండి ఆట ఆడితే ఇంకో లెవెల్లో ఉండేదని అమన్ అంటాడు.
వాళ్లేమీ మనల్ని విడగొట్టాలని చూడటం లేదు.. మనం ఎదుటి వాళ్లతో ఎలా ఉంటే.. మనతో వాళ్లు అలా ఉంటారు అని ఝాన్సీ అంటుంది. చరణ్ అసలు ఒక్క టాస్క్ గెలవలేదు.. నువ్వు చాలా టాస్కులు గెలిచావ్ అని నరేష్‌కి త్రిగుణ్, రాం ప్రసాద్ చెబుతుంటారు. ఇక వర్షిణి తన ఇంటి పరిస్థితులు, జీవితంలో దొరకని నాన్న ప్రేమను.. అన్నీ తల్చుకుంటూ ఏడ్చేస్తుంది. ముకేష్ చేయి పట్టుకుని నాన్న ఓ భరోసా ఇచ్చినట్టుగా ఉంటుందని, అది లవ్ ట్రాక్ కాదని త్రిగుణ్‌తో చెబుతూ కన్నీరు పెట్టుకుంటుంది. ఈ ఇంట్లోకి కొత్త వాళ్లు వచ్చేందుకు రెడీగా ఉన్నారు.. మీరు జాగ్రత్తగా ఉండాలని నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లను హెచ్చరిస్తాడు బిగ్ బాస్.
ఎండిపోయిన చెట్టు మీద నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లు, వికసించిన చెట్టు.. దేబ్జానీ, వంశీ, సుధీర్, వర్షిణి ఫోటోలు ఉంటాయి. ఆటలు ఆడి.. ఎండిపోయిన చెట్టు మీద నుంచి విరబూసిన చెట్టు మీదకు రావాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్తాడు. అలా అయితేనే సేఫ్ అవుతారని, ఈ సారి ఎలిమినేషన్ రెండు తాళాల మీద ఆధార పడి ఉంటుందని, ఒకటి ఆడియెన్స్ చేతిలో ఉంటే.. ఇంకోటి ఈ టాస్కుల చేతిలో ఉంటుందని చెప్పాడు. దీంతో ఇద్దరిద్దరూ కలిసి జట్టుగా విడిపోవాలని బిగ్ బాస్ చెప్తాడు. అమన్ వద్దకు వచ్చి కలిసి ఆడుదాం అని త్రిగుణ్ అంటాడు.
నిన్ను రిస్క్ జోన్‌లో పడేయాలని అలా అంటున్నాడు అని అమన్‌కి బ్రెయిన్ వాష్ చేస్తాడు రోహిత్. నీకు కెప్టెన్‌గా అవకాశం వచ్చి పోయింది కదా.. నీకు ఛాన్స్ ఇస్తా అని త్రిగుణ్ అంటాడు. మనం కలిసి ఆడుదామా? అని రోహిత్‌ని అపూర్వ అడుగుతుంది. ఆగండి అని అంటాడు రోహిత్. ఇక అక్కడ రోహిత్, షాలినీ కలిసి ఆడాలని అనుకుంటారు. మీరు అసలు నన్ను మీ గ్రూపులోకి స్వాగతిస్తున్నట్టుగా కూడా అనిపించడం లేదు అని అపూర్వ స్టార్ట్ చేస్తుంది. అసలు మా మధ్యలోకి ఎందుకు వస్తున్నావ్.. శ్రిష్టికి నాకు ఎందుకు గొడవలు పెడుతున్నావ్.. నిన్ను ఎందుకు సింక్ చేశాడు.. నన్ను ఎందుకు సేవ్ చేశాడు అని పోల్చి చూస్తున్నావ్ అంటూ అపూర్వ మీదకు షాలినీ వెళ్తుంది. ఇక ఈ ఇద్దరి మధ్య మాటల యుద్దం జరుగుతుంది.
మధ్యలో త్రిగుణ్ పేరు వస్తుంది. ఆ తర్వాత సుధీర్ టాపిక్ వస్తుంది. సుధీర్‌తో పెళ్లి కావాలి అని అన్నావ్ కదా అని రాం ప్రసాద్ అంటే.. అది సరదాగా అన్నాను అంటూ అపూర్వ చెబుతుంది. అక్కడో పెద్ద గొడవ జరుగుతుంది. చివరకు అపూర్వ కన్నీరు పెట్టుకుంటుంది. సరదాగా అన్న మాటల్ని సీరియస్‌గా చేస్తున్నారు అని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత పెట్టిన మొదటి టాస్కులో అపూర్వ, చరణ్ జోడి గెలిచి మొదటి స్థానంలో నిలుస్తుంది. ఆపై త్రిగుణ్, అమన్.. ముకేష్, ఝాన్సీ, నరేష్ రాం ప్రసాద్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లోకి వస్తారు. ఇక చివరగా రోహిత్ టాస్క్‌ని కూడా సరిగ్గా పూర్తి చేయలేక చివరి స్థానంలోకి వచ్చేస్తాడు. అలా షాలినీ, రోహిత్ జోడి మొదటి టాస్కులో ఓడిపోతుంది.
రోహిత్ ఒకప్పుడు నాతో క్లోజ్‌గా ఉండేవాడు అని చరణ్ అంటాడు. అంటే ఇప్పుడు ఉండటం లేదు.. అది నా వల్లే అని అంటున్నావా? అని షాలినీ మళ్లీ అక్కడ అలుగుతుంది. ఇంకో వైపు నరేష్ తన సామ్రాజ్యం, రాజు అంటూ ఓ కథ చెప్పి అందరినీ నవ్విస్తాడు. ఇదే ఎపిసోడ్‌లో షాలినీ, అపూర్వ గొడవ జరుగుతుంటే.. నరేష్, వర్షిణి కలిసి టైటానిక్ స్పూప్ చేసి అందరినీ నవ్విస్తారు. అలా కొంత ఫన్.. ఎక్కువ గొడవలతో నేటి ఎపిసోడ్ సాగింది.

