శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బైకర్'. 'నారీ నారీ నడుమ మురారి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన్నుంచి వస్తోన్న సినిమా ఇది.
'లూసర్' ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రం.. రేపు శుక్రవారం (ఏప్రిల్ 3) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇవాళ రాత్రి ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది.
'బైకర్' అనేది ఒక స్పోర్ట్స్ డ్రామా. ఇది భారతదేశపు మొట్టమొదటి ఫుల్ లెన్త్ మోటోక్రాస్ మూవీగా ప్రచారం చేయబడుతుంది. బైక్ రేసింగ్ తో పాటుగా తండ్రీ కొడుకులు, భార్య భర్తల మధ్య ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని ప్రమోషనల్ కంటెంట్ ని బట్టి తెలుస్తోంది. సెన్సార్ బోర్డు ఈ మూవీ చూసి U/A (యు/ఏ) సర్టిఫికేట్ జారీ చేసింది. సినిమా నిడివి 2 గంటల 35 నిమిషాలు వచ్చింది. సెన్సార్ టాక్ ప్రకారం, ఇదొక ఎమోషనల్ రోలర్‌కోస్టర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని తెలుస్తోంది.
* నేనూ శర్వానంద్ ఇంట్రోవర్ట్స్.. కానీ మా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది: మాళవిక నాయర్
'బైకర్' సినిమా ప్రధాన పాత్రధారుల నటన, సాంకేతిక నైపుణ్యంతో ఓవరాల్‌గా బ్లాక్‌బస్టర్ రైడ్ లా ఉంటుందని సెన్సార్ రిపోర్ట్ ని బట్టి తెలుస్తోంది. ఫస్టాఫ్ ప్రారంభంలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయని, శర్వానంద్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తాడని అంటున్నారు. సీనియర్ నటుడు డా. రాజశేఖర్ చాలా కాలం తర్వాత వెండితెరపై టెర్రిఫిక్ గా కనిపించారు. రియల్ రేస్ ట్రాక్‌లలో టాప్ క్వాలిటీతో తీసిన విజువల్స్ హైలైట్ గా నిలిచాయని చెబుతున్నారు. క్లిఫ్ జంప్ సీన్ అందరికీ గుర్తుండిపోతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇటీవలి కాలంలో మోస్ట్ ఇంటెన్స్ ఇంటర్వెల్స్ లో ఇదొకటి టాక్ వినిపిస్తోంది.
ఇక 'బైకర్' సెకండాఫ్ అంతటా తండ్రీకొడుకుల మధ్య అద్భుతమైన అనుబంధాన్ని హైలైట్ చేస్తుందని అంటున్నారు. క్లైమాక్స్‌లో మునుపెన్నడూ చూడని రేస్ సీన్ ఉంటుందని, గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని చెబుతున్నారు. శర్వానంద్, రాజశేఖర్ కాంబోలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలను పతాక స్థాయికి చేర్చాయని.. టాప్ నాచ్ మ్యూజిక్, సౌండ్ డిజైన్ సినిమాకు బిగ్ ప్లస్ అని సెన్సార్ రిపోర్ట్ చెబుతోంది. మొత్తం మీద సినిమాలో జానర్ కి తగ్గట్టుగా ప్రతి ఒక్క అంశమూ అత్యుత్తమ క్వాలిటీతో ఉంటుందని పేర్కొంటున్నారు. సెన్సార్ టాక్ ని బట్టి శర్వా ఖాతాలో బ్లాక్ బస్టర్ బొమ్మ పడినట్లేనని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

