Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Brahmamudi Serial Today August 4th Episode: బొక్కబోర్లా పడబోతోన్న ఐశ్వర్య.. మనవడిని ఆడుకున్న అమ్మమ్మ, తాతయ్య.. ఆగ్రహించిన రేఖ

Brahmamudi Serial Today August 4th Episode: బొక్కబోర్లా పడబోతోన్న ఐశ్వర్య.. మనవడిని ఆడుకున్న అమ్మమ్మ, తాతయ్య.. ఆగ్రహించిన రేఖ

Telugu Samayam 6 days ago

Brahmamudi Serial 2026 August 4th Episode Preview బ్రహ్మముడి సీరియల్‌లో మంగళవారం నాటి ఎపిసోడ్‌లో రాజు తమ మనవడు అని తెలియడంతో అపర్ణ, సుభాష్‌లు పొంగిపోతారు.

మనవడిని చూస్తూ ప్రేమతో అలా ఉండిపోతారు. కోపం ఉన్నట్టు, అలిగినట్టు నటించమని ఇందు చెబుతుంది. కానీ మనవడి ముందు ప్రేమతో అమ్మమ్మ, తాతయ్య కరిగిపోతారు. కానీ కోపం ఉన్నట్టుగా నటించేస్తారు. ఇంకో వైపు శశిగాడి వలలో ఐశ్వర్య చిక్కుకునేలా కనిపిస్తోంది. వాడి కోసం రెండు లక్షలు పెట్టి ఉంగరం కొనాలని ఐశ్వర్య అనుకుంటుంది.


గుడికి రాజు ఆలస్యంగా వస్తాడు. అప్పటికే అపర్ణ, సుభాష్‌లు వెళ్లిపోతారు. ఇక శేషు, భ్రమరంకి డౌట్ వచ్చిందని, అందుకే ఇలా వచ్చానని రాజు అంటాడు. ఇప్పుడు వచ్చి ఏం లాభం.. నేను రమ్మన్నప్పుడు రాలేదు కదా.. తాతయ్య, అమ్మమ్మ వెళ్లిపోయారు అని ఇందు అంటుంది. వాళ్లు వస్తున్నారు.. మన గురించి తెలిసిపోతుంది అని రాజు అంటాడు. ఇప్పుడేం చేస్తావ్ మరి అని ఇందు అంటుంది. ఇంతలో పంతులు వద్దకు వెళ్లి ఓ అబద్దం చెప్పాలి అని అంటాడు. కానీ తాను అబద్దం చెప్పలేనని అంటాడు. సరే.. ఇంతకు ముందు ఇక్కడ సత్య నారాయణ వ్రతం చేయించుకున్న జంట ఎక్కడుందని రాజు అడిగితే.. వారిని చూపిస్తాడు పంతులు. వారిద్దరి దగ్గరకు వెళ్లి.. రాజు, ఇందు ముచ్చట్లు పెడుతుంటారు. ఆ జంటను చూపించి.. ఆ ఇద్దరూ వ్రతం చేయించుకున్నారా? అని పంతుల్ని అడుగుతాడు శేషు. అవును.. చేయించుకున్నారు అని చెబుతాడు పంతులు. ఆ పంతులు చెప్పింది వేరే జంట గురించి.. శేషు అడిగింది ఇందు, రాజు గురించి. కానీ ఇద్దరూ ఒకే చోట ఉండటంతో నిజం బయటకు రాలేదు. అలా శేషు, భ్రమరంని బోల్తా కొట్టించేస్తాడు రాజు.ఇక్కడ ఇది.. అక్కడ వాళ్లు..

చూశావా? శేషు మామయ్యని, భ్రమరం అత్తయ్యని ఎలా మ్యానేజ్ చేశానో అని రాజు అంటాడు. వీళ్లను మ్యానేజ్ చేశావ్ .. అదే ముందుగా నేను పిలిచినప్పుడు వస్తే బాగుండేది కదా అని ఇందు అంటుంది. ఇప్పుడు వచ్చాను కదా.. అని రాజు అంటాడు. ఆల్రెడీ అమ్మమ్మ, తాతయ్యలు అలిగి కోపంతో వెళ్లారు.. వాళ్లు నీ మీద చాలా కోపంగా ఉన్నారు.. నువ్వు నాతో మాట్లాడకు అని కోపంగా వెళ్లిపోతుంది ఇందు. ఇది ఇక్కడ కోపంగా ఉంది.. వాళ్లు అక్కడ కోపంగా ఉన్నారు.. ఇద్దరినీ కూల్ చేయాలా? అని రాజు అనుకుంటూ వస్తాడు.


బుట్టలో పడబోతోన్న ఐశ్వర్య..

శశి గాడు ఐశ్వర్యకు ఫోన్ చేస్తాడు. పార్టీకి రావడం లేదు.. బిజినెస్ మీటింగ్.. ఢిల్లీకి వెళ్లాలి.. లేదంటే కోట్లలో నష్టం వస్తుంది అని శశి గాడు అంటాడు. అంటే వీడు ఇప్పుడు బిజినెస్ టేకప్ చేస్తాడన్న మాట.. త్వరలోనే ఆస్తి మొత్తం వీడికే వస్తుంది.. వీడ్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాల్సిందే అని ఐశ్వర్య అనుకుంటుంది. వచ్చాక నీకు సర్ ప్రైజ్ ఇస్తా అని శశి గాడు అంటాడు. చూస్తుంటే వాడు నాకు ప్రపోజ్ చేసేలా ఉన్నాడు.. మనం కూడా వీడికి కాస్ట్ లీ గిఫ్ట్ ఇవ్వాలి.. రెండు లక్షలు పెట్టి ఉంగరం కొనాలి.. రేఖ ఆంటీని రెండు లక్షలు అడగాలి అని ఐశ్వర్య అనుకుంటుంది.


నిజం తెలిసిపోయింది

రాజు బెదిరించడం, లక్కీ మ్యాటర్ గురించి రేఖ ఆలోచిస్తుంటే.. మాకు నిజం తెలిసిపోయింది అంటూ బాంబ్ పేల్చుకుంటూ వస్తారు శేషు, భ్రమరం. ఏం నిజం అని కంగారు పడుతుంది రేఖ. నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావ్ రేఖ అని భ్రమరం అడుగుతుంది. మీరు ఇలా సడెన్‌గా చెప్తే ఎవ్వరైనా కంగారు పడతారు కదా అని రేఖ అంటుంది. ఇందు, రాజు నిజంగానే భార్యాభర్తలు, ఈ రోజు వ్రతం కూడా చేశారు అని భ్రమరం అంటుంది. నేను ఎప్పటి నుంచో అదే చెప్తున్నా.. మీరు ఆ ఐశ్వర్య మాటల్ని నమ్మకండని రేఖ అంటుంది.


రెండు లక్షలు ఇవ్వండి..

ఇంతలో ఐశ్వర్య వచ్చి రెండు లక్షలు కావాలని అడుగుతుంది. రెండు లక్షలా అని శేషు, భ్రమరం షాక్ అవుతారు. నేను తింగరిదాన్ని కదా.. నన్ను ఎందుకు అడుగుతున్నావ్.. తాగి నన్ను ఎన్నెన్ని మాటలు అన్నావ్.. నీకు ఇవ్వను.. అసలు నిన్ను కొట్టాలని ఉంది.. అని రేఖ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. నీకు ఆ ఇందు అంటే కోపం ఉంటే ఉండొచ్చు.. అలా అని నిజాన్ని అబద్దం అని చెప్తావా? వాళ్లు భార్యాభర్తలు కాదని చెప్తావా? అని రేఖ అంటుంది. అవన్నీ వదిలేయండి. నాకు రెండు లక్షలు ఇవ్వండని రేఖను ఐశ్వర్య అడుగుతుంది. ఇవ్వను అని రేఖ చెప్పడంతో కోపంతో వెళ్లిపోతుంది ఐశ్వర్య.


నువ్వు మృత్యుంజయుడివి

మీ మనవడు వస్తున్నాడు.. కాస్త కోపం, అలక ఉన్నట్టు నటించండని అపర్ణ, సుభాష్‌లకు చెప్పి వెళ్తుంది ఇందు. అమ్మమ్మ అని పిలవడంతో అపర్ణ కరిగిపోతుంది. రాజుని చూసి మురిసిపోతుంది. కానీ ఇందు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి కోపం ఉన్నట్టు, అలిగినట్టుగా నటిస్తారు ఇద్దరూ. మా మాట అంటే విలువ లేదు.. నీకు ఎప్పుడూ నీ పనులేనా? అని అపర్ణ, సుభాష్ అంటారు. మీకోసం నేను ఏమైనా చేస్తాను అమ్మమ్మ, తాతయ్య అని రాజు అంటాడు. నువ్వు మా కోసం ఏమైనా చేస్తావ్ రా.. నువ్వు మృత్యుంజయుడివి అని అపర్ణ కంట్రోల్ తప్పుతుంటే సుభాష్ సైగ చేస్తాడు. దీంతో ఇద్దరూ రాజు మీద కోపం ఉన్నట్టుగా లోపలకు వెళ్లిపోతారు.


కిచెన్‌లో సరదాగా పోట్లాడుతూ

వీళ్లు కోపంగానే ఉన్నారు.. నా అద్దె పెళ్లాం కూడా కోపంగానే ఉంది.. ముందు దాన్ని కూల్ చేద్దాం అని కిచెన్‌లో ఉన్న ఇందు వద్దకు వస్తాడు రాజు. ఇందు అని ప్రేమగా పిలుస్తున్నట్టుగా మాటలు కలిపే ప్రయత్నం చేస్తాడు రాజు. కానీ ఇందు మాత్రం కోపం ఉన్నట్టుగా నటిస్తుంది. చపాతి పిండితో రాజుని కొడుతుంది. ఇద్దరూ కిచెన్‌లో సరదాగా పోట్లాడుతూ ఉంటారు. అంతటితో నేటి ఎపిసోడ్ పూర్తవుతుంది. 'గుండెనిండా గుడిగంటలు' టుడే ఎపిసోడ్: రోహిణిని శపించిన బాలు.. ఇక మనోజ్ కాపురం కొల్లేరు.. ఎదురుపడనున్న మాణిక్యం


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam